‘దూరం ప్రేమను మరింత పెంచుతుంది’

తాజా వార్తలు

Published : 14/02/2021 13:52 IST

‘దూరం ప్రేమను మరింత పెంచుతుంది’

ముంబయి పోలీసుల వినూత్న వీడియో..

ముంబయి: వాలంటైన్స్‌డేని కూడా ముంబయి పోలీసులు కొవిడ్‌ ప్రచారానికి వాడుకున్నారు. భౌతిక దూరంపై అవగాహన కలిగిస్తూ వినూత్నంగా ఓ ప్రత్యేక వీడియోని రూపొందించారు. ప్రేమికులరోజును జరుపుకొంటున్న నేపథ్యంలో భౌతికదూరం ఎంత ప్రాధాన్యమో ఈ వీడియో రూపంలో తెలియజేశారు. ఆ వీడియోని ట్విటర్‌లో ఉంచగా అది తెగ వైరలవుతోంది.

ఈ వీడియోలో మొదట ఓ జంట పక్కపక్కనే నిల్చుంటుంది. అనంతరం వారి మధ్యలో దూరం పెరుగుతూ.. ప్రేమ గుర్తులు ఏర్పడతాయి. తర్వాత ‘దూరం ప్రేమను మరింత పెంచుతుంది’ అనే క్యాప్షన్‌ వస్తుంది. కరోనా నేపథ్యంలో.. మాస్కు ధరించి, ఆరడుగుల దూరం పాటించాలంటూ పోలీసులు వీడియో ద్వారా సందేశమిచ్చారు. ఈ వీడియోను పంచుకున్న కొద్దిసేపటికే వేలల్లో లైకులు వచ్చాయి. పలువురు సరదా కామెంట్లు కూడా చేశారు. ఈ వీడియోపై మీమ్స్‌ కూడా వెల్లువెత్తుతున్నాయి.

ఇవీ చదవండి...

ఆ తల్లి ఫోన్‌కాల్‌.. 25 మందిని కాపాడింది
ఆరు దశాబ్దాలుగా ఆ గ్రామానికి సర్పంచి ఏకగ్రీవమే..!Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని