కుక్కల్ని తప్పించుకునే ప్రయత్నంలో..గోదారిలో పడి..
close

తాజా వార్తలు

Updated : 03/04/2021 14:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కుక్కల్ని తప్పించుకునే ప్రయత్నంలో..గోదారిలో పడి..

నిడదవోలు: పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు మున్సిపల్‌ ఛైర్మన్‌ భూపతి ఆదినారాయణ భార్య ఆండాలు ప్రమాదవశాత్తు గోదావరి కాల్వలో పడి మృతి చెందారు. ఇవాళ ఉదయపు నడక కోసం వెళ్తుండగా.. ఆమెపై కుక్కలు దాడి చేయడంతో తప్పించుకునే ప్రయత్నంలో పక్కనే ఉన్న కాల్వ మెట్లపైకి దిగారు. దీంతో మెట్లపై నుంచి జారి కాల్వలోకి పడిపోయారు. ఆ సమయంలో ఎవరూ గమనించకపోవడంతో ప్రవాహవేగానికి గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా.. ఉండ్రాజవరం కాల్దారి వద్ద మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని పోలీసులు నిడదవోలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని