పురపాలక ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం
close

తాజా వార్తలు

Updated : 10/03/2021 16:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పురపాలక ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆంధ్రప్రదేశ్‌లో పుర, నగర పాలక, నగర పంచాయతీల్లో ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. 2,214 డివిజన్‌, వార్డు స్థానాలకు ఇప్పటికే 580 ఏకగ్రీవం కాగా, మిగతా వాటికి బుధవారం ఉదయం 7 గంటలకు పోలింగ్‌ మొదలైంది. ఏలూరు నగర పాలక సంస్థలో ఎన్నికలు నిలిపివేయాలని హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ సోమవారం ఇచ్చిన స్టేను డివిజన్‌ బెంచ్‌ మంగళవారం సస్పెండ్‌ చేయడంతో అక్కడా పోలింగ్‌ కొనసాగుతోంది.  నాలుగు మున్సిపాలిటీలు ఇప్పటికే ఏకగ్రీవం కాగా, మిగిలిన 71 పురపాలికలు, 12 నగరపాలక సంస్థల్లో పోలింగ్‌ జరుగుతోంది.  మొత్తం 7,549 మంది అభ్యర్థులు బరిలో ఉండగా...77,73,231 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని