HYD: మరదలిని చంపి సంపులో పడేశాడు!
close

తాజా వార్తలు

Updated : 13/04/2021 09:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

HYD: మరదలిని చంపి సంపులో పడేశాడు!

కూకట్‌పల్లిలో ఆలస్యంగా వెలుగులోకి..

మూసాపేట: వరుసకు బావయ్యే ఓ యువకుడు అనుమానంతో మరదలి గొంతు నులిమి హత్య చేశాడు. హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో ఈనెల 10న జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. మూసాపేట హబీబ్‌నగర్‌కు చెందిన సోమేశ్వరరావు, నీలమ్మ దంపతుల చిన్న కుమార్తె మంజుల (19) నగరంలో బీటెక్‌ చదువుతోంది. కూకట్‌పల్లి ఏవీబీ పురానికి చెందిన ఢిల్లేశ్వరరావు చిన్న కుమారుడు భూపతి ఈమెకు వరుసకు బావ అవుతాడు. సమీప బంధువులు కావడంతో పెద్దలు వీరికి వివాహం చేయాలని గతంలోనే నిర్ణయించారు.

అయితే మంజుల తనను దూరం పెట్టి ఇతర యువకులతో సన్నిహితంగా ఉంటోందని భావించిన భూపతి.. ఆమెపై అనుమానం పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో ఈనెల 10న ఎవరూ లేని సమయంలో మంజులను తన ఇంటికి పిలిచాడు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య జరిగిన వాగ్వాదం ఘర్షణకు దారి తీసినట్లు తెలుస్తోంది. దీంతో క్షణికావేశానికి గురైన భూపతి.. మరదలి గొంతు నులిమి హతమార్చాడు. ఆ తర్వాత మృతదేహాన్ని ఇంటి ఆవరణలోని నీటి సంపులో పడేశాడు. ఆపై తానూ ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించినా.. ధైర్యం చాలకపోవడంతో అదే రోజు కూకట్‌పల్లి ఠాణాకు వచ్చి లొంగిపోయినట్లు సీఐ నరసింగరావు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆయన చెప్పారు. 



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని