
తాజా వార్తలు
ఆశ్రమ నిర్వాహకుడి దారుణ హత్య
ఐరాల: చిత్తూరు జిల్లా ఐరాల మండలం గుండ్లపల్లెలో విషాదం చోటు చేసుకుంది. భగవాన్ శ్రీ రామతీర్థం ఆశ్రమ నిర్వాహకుడు అచ్యుతానందగిరి (75) హత్యకు గురయ్యాడు. ఈయన కొన్నేళ్లుగా రామతీర్థ ఆశ్రమానికి నిర్వాహకుడిగా ఉంటున్నాడు. మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తి ఆశ్రమంలోకి చొరబడి అచ్యుతానందగిరి తలపై దాడి చేశాడు. దీంతో ఆయన కిందిపడిపోయినట్లు ప్రత్యక్ష సాక్షి ఆయన సేవకురాలు లక్ష్మమ్మ తెలిపారు. అనంతరం ఆ దుండగుడు అచ్యుతానంద గొంతు నులిమి చంపేశాడని ఆమె పోలీసులకు తెలిపారు.
డీఎస్పీ సుధాకర్ రెడ్డి, చిత్తూరు పశ్చిమ సీఐ లక్ష్మీకాంత్ రెడ్డి, ఐరాల ఎస్సై శ్రీకాంత్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని ఘటనపై ఆరా తీశారు. చిత్తూరు నుంచి వచ్చిన ప్రత్యేక క్లూం టీమ్ ఘటనా స్థలిలో ఆధారాలు సేకరించింది. మృతదేహాన్ని చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమెదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.
ఇవీ చదవండి..
నేను కాళికను.. ఆయన నా భర్తే కాదు..
నడుస్తూ వెళ్తున్న మహిళను ఢీకొన్న బైకు..మృతి