close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 13/05/2020 01:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఇంటి యజమానిని హతమార్చి చోరీ

పెదకూరపాడు: గుంటూరు జిల్లా పెదకూరపాడు మండలం కాశిపాడులో అర్ధరాత్రి దారుణం చోటు చేసుకుంది. తుళ్లూరు డీఎస్పీ శ్రీనివాసరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కాశిపాడు గ్రామంలో పులిపాటి రాధాకృష్ణమూర్తి(68), వెంకటనర్సమ్మ దంపతులు చిల్లర దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. సోమవారం రాత్రి వారు వ్యాపారం ముగించుకుని ఇంట్లోకి వెళ్లగానే... అప్పటికే ఇంట్లోకి చొరబడ్డ అదే గ్రామానికి చెందిన మల్లెల గోపి అలియాస్‌ పిల్ల గోపి వారిద్దరిపై కొడవలితో దాడి చేశాడు. 

ఈదాడిలో రాధాకృష్ణమూర్తి గొంతు, మెడపై తీవ్రగాయాలవ్వడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. దాడిని ప్రతిఘటించిన వెంకటనర్సమ్మ తీవ్ర గాయాలతో సొమ్మసిల్లి పడిపోయింది. దీంతో ఆమె కూడా మృతి చెందిందని భావించిన నిందితుడు ఆమె ఒంటిపై ఉన్న సుమారు 152గ్రాముల బంగారు ఆభరణాలు తీసుకుని పరారయ్యాడు. నిందితుడు పరారైన కొద్దిసేపటికి స్పృహలోకి వచ్చిన ఆమె గుంటూరులో ఉంటున్న పెద్దకుమారుడు సురేశ్‌కు ఫోన్‌ చేసి దాడి జరిగిన విషయం చెప్పింది. వెంటనే స్పందించిన సురేశ్‌  డయల్‌ 100, 108కు సమాచారం అందించాడు. మంగళవారం తెల్లవారుజామున ఘటనా స్థలికి చేరుకున్న 108 సిబ్బంది అప్పటికే అపస్మారకస్థితిలో ఉన్న ఆమెను ప్రథమచికిత్స కోసం అమరావతి సీహెచ్‌సీకి, అనంతరం మెరుగైన చికిత్స కోసం గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. బాధితురాలు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనాస్థలి వద్ద జనసమూహంలో ఉన్న నిందితుడు మల్లెల గోపీని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. నేరం అంగీకరించడంతో నిందితుడి ఇంట్లో అటకపై దాచిన బంగారు ఆభరణాలతో పాటు దాడికి ఉపయోగించిన కొడవలిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.