భార్య, అత్త దారుణహత్య
close

తాజా వార్తలు

Published : 11/04/2021 08:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భార్య, అత్త దారుణహత్య

జిన్నారం(సంగారెడ్డి): కట్టుకున్న భార్య, అత్తను ఓ వ్యక్తి దారుణంగా హత్య చేసిన ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..  ఐడీఏ  బొల్లారంలోని గాంధీనగర్‌లో ఎలక్ట్రీషియన్‌ నర్సింహ దంపతులు నివాసం ఉంటున్నారు. ఆదివారం తెల్లవారుజామున నర్సింహ తన భార్య స్వరూప(32), అత్త ఎల్లమ్మ(55)పై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరీశీలించారు. హత్యకు గల కారణాలు తెలియరాలేదని సీఐ జి.ప్రశాంత్‌ తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.  


 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని