పది మంది భార్యలు.. కోట్ల ఆస్తి.. దారుణ హత్య!
close

తాజా వార్తలు

Published : 25/01/2021 07:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పది మంది భార్యలు.. కోట్ల ఆస్తి.. దారుణ హత్య!

ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓ వ్యక్తిని దుండగులు దారుణంగా హత్య చేశారు. పది మంది భార్యలున్న అతడిని ఆస్తి కోసమే చంపినట్లు తెలుస్తోంది. భోజిపురాకు చెందిన జగన్‌లాల్‌ యాదవ్‌(52) అనే రైతు.. తమ పూర్వీకుల ఆస్తిని వారసత్వంగా పొంది కోటీశ్వరుడు అయ్యాడు. పది మంది భార్యలు కలిగిన అతడు.. ఆ ఆస్తిని తన దత్తపుత్రుడికి బదిలీ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇంతలో దారుణ హత్యకు గురయ్యాడు. మూడు రోజుల క్రితం అతడి పొలంలోనే గొంతుకోసి, తలపై రాడ్‌తో కొట్టి చంపారు. ప్రధాన రహదారికి సమీపంలో అతడికి భూములు ఉండటం వల్ల.. వాటిపై కన్నేసిన దుండగుల ఈ దారుణానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. అతడికి, పిల్లలెవరూ లేరని  పోలీసులు తెలిపారు. మొదటి భార్యకు చెందిన ఓ దత్తపుత్రుడు ఆ కుటుంబంతో ఉన్నట్లు వివరించారు. జగన్‌లాల్‌కు 1990లో తొలి వివాహం జరిగింది. ఆ తర్వాత ఐదుగురు భార్యలు ఒకరి తర్వాత ఒకరు అనారోగ్యంతో చనిపోయారు. మరో ముగ్గురు అతడ్ని వదిలేసి వెళ్లిపోయారు. హత్యకు ముందు వరకు పశ్చిమబెంగాల్‌కు చెందిన ఇద్దరు భార్యలతో ఉన్నట్లు తెలిసింది.

ఇవీ చదవండి..
కనిపెంచిన చేతులే.. కాటేశాయి
చూస్తే పిజ్జా ప్యాక్‌.. విప్పితే మెథకొలైన్‌


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని