
తాజా వార్తలు
హత్య చేసి..తల, మొండెం వేరు చేసి
వికారాబాద్ జిల్లాలో దారుణం
బొంరాస్పేట్: వికారాబాద్ జిల్లా బొంరాస్పేట్ మండలం మెట్లకుంటలో దారుణం చోటు చేసుకుంది. కుర్వ చంద్రయ్య(52)ను గుర్తు తెలియని వ్యక్తులు అతికిరాతకంగా హత్య చేశారు. ఘటన అనంతరం దుండగులు తల, మొండెంను వేరు చేశారు. తలను చెరువులో, మొండెంను ముళ్లపొదల్లో పడేశారు. ఆదివారం పొలం పనులకు వెళ్లిన చంద్రయ్య ఎంత సేపటికీ ఇంటికి తిరిగి రాలేదు. దీంతో అతని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గాలింపు చేపట్టిన పోలీసులు మెట్లకుంట ఎల్లమ్మ చెరువు వద్ద చంద్రయ్య మృతదేహాన్ని గుర్తించారు. ఘటనకు కారణమైన ప్రధాన నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. హత్యకు పాత కక్షలే కారణమని మెట్లకుంట వాసులు భావిస్తున్నారు.
ఇవీ చదవండి
Tags :