నరసరావుపేటలో కొనసాగుతున్న ఉద్రిక్తత
close

తాజా వార్తలు

Updated : 24/02/2021 18:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నరసరావుపేటలో కొనసాగుతున్న ఉద్రిక్తత

బాధిత కుటుంబానికి రూ.కోటి చెల్లించాలని డిమాండ్‌

నరసరావుపేట (లీగల్‌): గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఉద్రిక్తత కొనసాగుతోంది. హత్యకు గురైన డిగ్రీ విద్యార్థిని కోట అనూష (18) కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఆమె కుటుంబసభ్యులు, విద్యార్థులు సుమారు ఐదు గంటలుగా ఆందోళన చేస్తున్నారు. ఈ ఆందోళనకు తెదేపా, ఏఐఎస్‌ఎఫ్‌ నేతలు మద్దతు తెలిపారు. బాధిత కుటుంబానికి రూ.కోటి నష్టపరిహారం చెల్లించాలని ఆందోళనకారులు డిమాండ్‌ చేస్తున్నారు. పల్నాడు బస్టాండ్‌లోని ప్రధాని రహదారిపై విద్యార్థులు ధర్నాకు దిగారు. ఈ ఆందోళన నేపథ్యంలో అక్కడికి పోలీసులు భారీగా చేరుకున్నారు. మరోవైపు సబ్‌కలెక్టర్‌, రెవెన్యూ అధికారులు అక్కడికి చేరుకుని కుటుంసభ్యులతో మాట్లాడారు.

నరసరావుపేట మండలం రావిపాడు శివారులో ఓ ప్రైవేటు కళాశాలకు చెందిన విద్యార్థిని అనూషను తోటి విద్యార్థి విష్ణువర్ధన్‌రెడ్డి హతమార్చాడు. మాట్లాడుకుందామని చెప్పి అనూషను ద్విచక్రవాహనంపై రావిపాడు శివారుకు తీసుకెళ్లిన విష్ణువర్ధన్‌.. ఆమెను అక్కడ గొంతు నులిమి చంపేశాడు. అనంతరం నిందితుడు ఠాణాలో లొంగిపోయాడు. వెంటనే సమాచారం తెలుసుకున్న నరసరావుపేట గ్రామీణ పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి మార్చురీ వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్న బంధువులు, విద్యార్థులు అనూష మృతదేహంతో ర్యాలీగా పల్నాడు బస్టాండ్‌ వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని