భగవద్గీత నేర్పిస్తున్న నజీర్‌ బాషా
close

తాజా వార్తలు

Published : 19/11/2020 02:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భగవద్గీత నేర్పిస్తున్న నజీర్‌ బాషా

ఇంటర్నెట్ డెస్క్‌: మతాలకు అతీతంగా యోగా నేర్పిస్తామన్న ఓ బోర్డు ఓ ముస్లిం జీవితాన్నే మార్చేసింది. ఉద్యోగ విరమణ అనంతరం ఇంటిపట్టునే ఉండకుండా భగవద్గీత సారాన్ని, యోగా ప్రయోజనాలను భవిష్యత్‌ తరాలకు అందిస్తున్నారు. ఖురాన్‌, బైబిల్‌, భగవద్గీతను చదివిన ఆయన సర్వమత సమాన సందేశాన్ని పాటిస్తూ భారతీయులంతా విశ్వమానవులుగా ఎదగాలని సందేశాన్ని వినిపిస్తున్నారు.

నెల్లూరులోని మూలపేటకు చెందిన షేక్‌ నజీర్‌ బాషా గతంలో స్టేట్‌ బ్యాంకులో పనిచేశారు. ఉద్యోగం చేస్తున్న రోజుల్లోనే నల్గొండ జిల్లాలోని వృక్షమయి గురువు వద్ద శిష్యులుగా చేరారు. యోగా, భగవద్గీతను పూర్తిగా నేర్చుకున్న ఆయన ఉద్యోగ విరమణ అనంతరం చిన్నారులకు వాటి గొప్పదనాన్ని వివరిస్తున్నారు. వారికి శిక్షణ ఇచ్చేందుకు సొంత ఖర్చుతోనే 2010లో ఓ భవనాన్ని నిర్మించారు. హిందుత్వంలోని గొప్పదనాన్ని సగటు హిందువుకంటే గొప్పగా వివరించే నజీర్‌ బాషా వద్ద వందలాది చిన్నారులు భగవద్గీత పాఠాలు నేర్చుకుంటున్నారు. రోజుకు ఐదుసార్లు నమాజ్‌ చేసే నజీర్‌ బాషా అంతే భక్తితో భగవద్గీతను బోధిస్తున్నారు.

‘యోగా మతపరమైనదని, హిందూ ధర్మమని అనుకునేవాడిని. కానీ మతాలకు అతీతంగా యోగా నేర్పబడును అనే ఓ బోర్డు చూశాక నా ఆలోచనా విధానం మారింది. యోగా నేర్చుకొని ఇప్పుడు బోధిస్తున్నాను’ అని నజీర్‌ బాషా పేర్కొన్నారు. వచ్చే పింఛనును సైతం యోగా నేర్చుకునే విద్యార్థులకు మంచి ఆహారం అందించేందుకు, యోగా ప్రచారానికి వినియోగిస్తున్నారు. మత భేదాన్ని మరిచి విశ్వమానవునిగా భారతీయులు ఎదగాలని ఆయన పిలుపునిస్తున్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని