Twitter: ఇక్కడి చట్టాలకు కట్టుబడాల్సిందే..!
close

తాజా వార్తలు

Published : 18/06/2021 21:01 IST

Twitter: ఇక్కడి చట్టాలకు కట్టుబడాల్సిందే..!

దిల్లీ: దేశంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నప్పుడు ఇక్కడి చట్టాలకు కట్టుబడి ఉండాల్సిందేనని ట్విటర్‌కు పార్లమెంటరీ స్థాయీ సంఘం స్పష్టంచేసింది. కంపెనీ పాలసీల కంటే ఇక్కడి చట్టాలు పాటించడమే శిరోధార్యం అని ఉద్ఘాటించింది. నూతన ఐటీ నిబంధనల విషయంలో కేంద్రానికి, ట్విటర్‌కు మధ్య వివాదం నడుస్తున్న వేళ పార్లమెంటరీ స్థాయీ సంఘం ఎదుట ట్విటర్‌ ఇండియా ప్రతినిధులు హాజరయ్యారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శశిథరూర్‌ నేతృత్వంలోని ఈ స్థాయీ సంఘం సమావేశానికి ట్విటర్‌ ఇండియా తరఫున పబ్లిక్‌ పాలసీ మేనేజర్‌ షగుప్త కర్మన్‌, లీగల్‌ న్యాయవాది ఆయుష్‌ కపూర్‌ హాజరయ్యారు.

ఈ సందర్భంగా ట్విటర్‌కు స్థాయీ సంఘం పలు ప్రశ్నలను సంధించగా.. దీనికి ఆ కంపెనీ ప్రతినిధులు అస్పష్టంగా సమాధానం ఇచ్చినట్లు సమాచారం. దేశ చట్టాలను ఉల్లంఘించినందుకు ట్విటర్‌పై ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలని స్థాయీ సంఘం గట్టిగా ప్రశ్నించినట్లు తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా కేంద్రానికి, ట్విటర్‌కు మధ్య ఘర్షణ పూరిత వాతావరణం నెలకొన్న వేళ ఈ సమావేశం జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. కొత్త ఐటీ నిబంధనలను గడువులోగా ట్విటర్‌ పాటించకపోవడం కేంద్రం ఆగ్రహానికి కారణమైంది. దీనికి తోడు టూల్‌కిట్‌ వ్యవహారం, పలువురు ప్రముఖల ఖాతాలకు బ్లూ టిక్‌ తొలగింపు అంశాలు ఈ దూరాన్ని మరింతగా పెంచిన సంగతి తెలిసిందే.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని