close
Array ( ) 1

తాజా వార్తలు

చదువుల ఖర్చులను తట్టుకోవాలంటే..

నేను నెలకు రూ.3,000 పెట్టుబడి పెట్టగలను. కనీసం 3-4 ఏళ్లు మదుపు చేస్తాను. ప్రస్తుతం హెచ్‌డీఎఫ్‌సీ స్మాల్‌ క్యాప్‌ ఫండ్‌లో రూ.2,000 మదుపు చేస్తున్నా. నా వయసు 50 ఏళ్లు. ప్రస్తుతం నేను ఎలాంటి పథకాలను ఎంచుకోవాలి? ఆన్‌లైన్‌లో నేరుగా మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేసేందుకు వీలవుతుందా?

- నాగరాజు

ఈక్విటీలో పెట్టుబడి పెట్టాలంటే.. కనీసం 7-10 ఏళ్ల సమయం ఇవ్వాలి. మీకు 3-4 ఏళ్ల వ్యవధి ఉంటే.. పెట్టుబడి పెట్టకండి.. మీ వయసు 50 ఏళ్లు కాబట్టి, ఇంకా పదేళ్లపాటు మదుపు చేస్తే.. పదవీ విరమణ తర్వాత అవసరాలకు వాడుకోవచ్చు. మీరు మదుపు చేసిన ఫండ్‌ పనితీరు బాగానే ఉంది. కొత్తగా మదుపు చేసే మొత్తంతో కలిపి మీ పెట్టుబడి రూ.5వేలు. ఇలాంటప్పుడు స్మాల్‌క్యాప్‌లో అధిక పెట్టుబడి పెట్టినట్లు అవుతుంది. కాబట్టి, మీ పోర్ట్‌ఫోలియోను కాస్త సరిచేసుకోవాలి. హెచ్‌డీఎఫ్‌సీ స్మాల్‌ క్యాప్‌లో రూ.2,000లకు బదులు రూ.1,000 సిప్‌ చేయండి. ఇక మిగతా రూ.4 వేలలో మిరే అసెట్‌ లార్జ్‌ క్యాప్‌ ఫండ్‌లో రూ.2,000, యాక్సిస్‌ మల్టీ క్యాప్‌ ఫండ్‌లో రూ.2,000 చొప్పున మదుపు చేయండి. ఇప్పటికే మీరు ఫండ్లలో మదుపు చేస్తున్నారు కాబట్టి, ఆయా ఫండ్‌ సంస్థల వెబ్‌సైట్లలోకి వెళ్లి నేరుగా కూడా మదుపు చేసేందుకు వీలుంది.

మా పాప ప్రస్తుతం ఎల్‌కేజీ చదువుతోంది. తన స్కూలు ఫీజుకు రూ.లక్ష వరకూ ఖర్చవుతోంది. ఇప్పుడే ఇలా ఉంటే.. తను ఇంటర్‌, ఇంజినీరింగ్‌కు వచ్చేసరికి ఖర్చులు ఎలా ఉంటాయో అని భయం వేస్తోంది. నేను నెలకు రూ.5,000 వరకూ పెట్టుబడి పెట్టగలను. ఇది సరిపోతుందా? 15 ఏళ్లపాటు మదుపు చేస్తే ఎంత రావచ్చు?

- భారతి

ప్రస్తుతం దేశంలో విద్యా ద్రవ్యోల్బణం వేగంగా పెరుగుతోంది. ఇది దాదాపు 10శాతం వరకూ ఉంది. ఒకప్పుడు ఎల్‌కేజీ నుంచి పీజీకి అయ్యే ఖర్చు.. ఇప్పుడు ఎల్‌కేజీకే అవుతోంది. మధ్యతరగతి వారు సంపాదించే మొత్తంలో దాదాపు 25శాతం వరకూ పిల్లల చదువులకే వెళ్లిపోతోంది. ఇప్పటినుంచే సరైన ప్రణాళిక లేకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు. మీరు నెలకు రూ.5వేలను.. 11శాతం రాబడి అంచనాతో మదుపు చేస్తే.. 15 ఏళ్ల తర్వాత రూ.20,64,321 అయ్యే వీలుంది. ఇది మీ పాప ఉన్నత చదువులకు సరిపోకపోవచ్చు. మీ పాప చదువుల ఖర్చుకు ఇప్పుడు మీరు పెడుతున్న ఖర్చును లెక్కలోకి తీసుకుంటే.. దాదాపు నెలకు రూ.20వేల వరకూ మదుపు చేయాల్సి ఉంటుంది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.