close
Array ( ) 1

తాజా వార్తలు

చైతూకు జోడీగా ఎవరు?

హైదరాబాద్‌: ప్రస్తుతం ‘లవ్‌స్టోరీ’తో బిజీగా ఉన్నారు నాగచైతన్య. శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సాయిపల్లవి కథానాయిక. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమాను వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇది సెట్స్‌పై ఉండగానే మరో చిత్రానికి చైతూ పచ్చజెండా ఊపారు.

పరశురామ్‌తో ఓ సినిమా చేయబోతున్నారు. ‘నాగేశ్వరరావు’ అనే పేరు పరిశీలనలో ఉంది. ఈ సినిమా కోసం కథానాయిక వేట సాగుతోంది. రష్మిక, కీర్తి సురేష్‌ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ‘లవ్‌ స్టోరీ’ తరవాత ఈ చిత్రం పట్టాలెక్కబోతోంది. చైతూ ఓ మధ్యతరగతి యువకుడిగా కనిపిస్తారని, నాయిక పాత్రకీ ప్రాధాన్యం ఉందని తెలుస్తోంది. మరి ఎవరిని ఎంపిక చేస్తారో చూడాలి.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.