close

తాజా వార్తలు

Published : 25/07/2020 13:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

#నాగశౌర్య 20 ప్రీలుక్‌ అదిరిపోయింది!

ఫస్ట్‌లుక్‌ ఎప్పుడంటే..

ఇంటర్నెట్‌ డెస్క్‌: యువ కథానాయకుడు నాగశౌర్య తన కొత్త సినిమా ఫస్ట్‌లుక్‌ విడుదల తేదీని ప్రకటించాడు. ‘సుబ్రహ్మణ్యపురం’ దర్శకుడు సంతోష్‌ జాగర్లపూడితో కలిసి నాగశౌర్య తన 20వ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను ఈ నెల 27న విడుదల చేయబోతున్నట్లు ప్రకటిస్తూనే.. నాగశౌర్య తన ప్రీలుక్‌ను విడుదల చేశాడు. పురాతన క్రీడల్లో ఒక క్రీడతో మిమ్మల్ని కలిసేందుకు సిద్ధమవుతున్నామని ట్వీట్‌లో పేర్కొన్నాడు. ఎప్పుడూ లవర్‌బాయ్‌లా కనిపించే నాగశౌర్య ఈ చిత్రంలో కండలవీరుడిగా కనిపించబోతున్నాడు. ప్రీలుక్‌లో మెలితిరిగిన కండలతో కొత్తగా కనిపిస్తున్నాడు. సినిమా కోసం జుట్టు, గడ్డం కూడా బాగా పెంచాడు. ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌, నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. లాక్‌డౌన్‌కు ముందు జనవరిలో ‘అశ్వథ్ధామ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగశౌర్య.. మంచి విజయాన్ని అందుకున్నాడు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

Panch Pataka

దేవతార్చన