
తాజా వార్తలు
భాజపా మాటలు నమ్మొద్దు: నామా
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటోందని తెరాస లోక్‌సభాపక్షనేత నామా నాగేశ్వరరావు ఆరోపించారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం హైదరాబాద్ వస్తున్న కేంద్ర మంత్రులు వరదల సమయంలో ఒక్కరూ రాలేదని నామా విమర్శించారు. ఆరేళ్లలో రాష్ట్రానికి, హైదరాబాద్‌కు ఏం చేశారో భాజపా నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్ని లేఖలు రాసినా కనీసం రాష్ట్రానికి ఒక్క ప్రాజెక్టయిన కేటాయించలేదని నామా ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్- బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్‌పై ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా కేంద్రం స్పందించలేదన్నారు. గత ఆరేళ్లుగా హైదరాబాద్‌లో మత సామరస్యం ఉందని, చిన్న సంఘటన కూడా జరగకుండా నగరాన్ని కాపాడుకున్నామని వివరించారు. మత సామరస్యాన్ని దెబ్బతీయాలన్నదే భాజపా వ్యూహమని ఆరోపించారు. కేంద్రం... గుజరాత్, కర్ణాటకకు వరదసాయం చేసి తెలంగాణకు మొండిచేయి చూపిందని విమర్శించారు. చెప్పులు అరిగేలా తిరిగినా రీజినల్ రింగ్‌రోడ్డు మంజూరు చేయలేదన్నారు. ఏం అడిగినా ఇవ్వని భాజపాకు ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు. భాజపా నేతలు అబద్ధాలు, మోసపు మాటలు చెబుతున్నారని ఆరోపించారు. తెలంగాణలో పన్నుల ద్వారా వచ్చిన నిధులను ఇతర రాష్ట్రాల్లో వినియోగిస్తున్నారని వివరించారు. గత ఆరేళ్లలో తెరాస హాయంలో హైదరాబాద్‌ను బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకున్నామని నామా నాగేశ్వరారవు పేర్కొన్నారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- అలా చేస్తే భారత్‌దే విజయం: గావస్కర్
- సైఫ్ అలీఖాన్ ఇంటి వద్ద భద్రత కట్టుదిట్టం
- ఓవైపు కవ్వింపులు.. మరోవైపు అరుపులు
- నాన్‌స్టాప్ ‘ఫన్’షూట్.. లంగాఓణి ‘ఉప్పెన’ రాణి
- కాస్త బంతిని చూడవయ్యా సుందరం: వీడియో వైరల్
- ఆ వార్తల్లో నిజం లేదు.. మోహన్‌బాబు టీమ్
- అఫ్గాన్ కార్లకు ‘39’ నంబర్ ఉండబోదు.. ఎందుకంటే?
- గబ్బా కాదు..శార్దూల్-సుందర్‌ల దాబా: సెహ్వాగ్
- టీకా పంపిణీలో భారత్ ప్రపంచ రికార్డ్!
- మరో 6 పరుగులు చేసుంటే..
ఎక్కువ మంది చదివినవి (Most Read)
