ఆదాయం తగ్గిపోయింది...ఆదుకోండి: జగన్‌
close

తాజా వార్తలు

Published : 02/04/2020 12:48 IST

ఆదాయం తగ్గిపోయింది...ఆదుకోండి: జగన్‌

అమరావతి: కరోనా పరిస్థితిపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి.. కరోనా వ్యాప్తిని నివారించేందుకు రాష్ట్రంలో తీసుకుంటున్న చర్యలను ప్రధానికి వివరించారు. గడచిన రెండు రోజుల్లో కేసుల సంఖ్య పెరగడానికి గల కారణాలను వెల్లడించారు. 

ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్‌లో నమోదైన 132 కరోనా పాజిటివ్‌ కేసుల్లో 111 మంది జమాత్‌కు వెళ్లిన వారు, వారితో కాంటాక్టులో ఉన్నావారేనని సీఎం తెలిపారు. కుటుంబం వారీగా చేస్తున్న సర్వే అంశాలను ప్రధానికి వివరించారు. బాధితులను క్వారంటైన్‌, ఐసోలేషన్‌కు తరలించి వైద్య సదుపాయాలు అందిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ఆదాయం బాగా దెబ్బతిందని, తగిన విధంగా ఆదుకోవాలని కోరారు. వైద్య పరికరాలను తగిన సంఖ్యలో అందించాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని