అలా చేస్తే.. జీవితంలో పనిచేయాల్సిన రోజే ఉండదు
close

తాజా వార్తలు

Published : 20/03/2021 12:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అలా చేస్తే.. జీవితంలో పనిచేయాల్సిన రోజే ఉండదు

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా యువ పేసర్‌ నటరాజన్‌ మళ్లీ జట్టుతో కలిశాడు. ఇటీవల భుజం గాయం కారణంగా జట్టుకు దూరమైన అతడు బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీలో పూర్తి ఫిట్‌నెస్‌ సాధించాడు. వచ్చేవారం ఇంగ్లాండ్‌తో జరగబోయే మూడు వన్డేల సిరీస్‌కు బీసీసీఐ నటరాజన్‌ను ఎంపిక చేసింది.

‘బ్లూ జెర్సీలో మళ్లీ టీమ్‌ఇండియా ఆటగాళ్లతో కలవడం ఉత్సాహంగా ఉంది. అలాగే మీకు ఇష్టమైన పనిని వృత్తిగా ఎంచుకోండి. అలా చేస్తే జీవితంలో పనిచేయాల్సిన రోజే ఉండదు’ అని నటరాజన్‌ అన్నాడు. గతేడాది ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరఫున అద్భుత ప్రదర్శన చేయడంతో ఆస్ట్రేలియా పర్యటనకు నెట్‌బౌలర్‌గా నటరాజన్‌ ఎంపికయ్యాడు. అక్కడ అనుకోని పరిస్థితుల్లో మూడు ఫార్మాట్లలో అరంగేట్రం చేసి కొత్త రికార్డు నెలకొల్పడమే కాకుండా తన ఎంపికకు న్యాయం కూడా చేశాడు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఇంగ్లాండ్‌తో వన్డే జట్టుకు ఎంపికయ్యాడు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని