close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 13/05/2020 02:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పదేళ్ల పన్ను విరామం!

దేశంలో కొత్తగా పెట్టే భారీ పెట్టుబడులపై ప్రభుత్వ పరిశీలనలో ప్రతిపాదన

దిల్లీ: దేశంలో కొత్తగా పెట్టుబడులు పెట్టే కంపెనీలకు పన్ను విరామాన్ని ప్రకటించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు వాణిజ్య మంత్రిత్వ శాఖ చేసిన ప్రతిపాదనను ఆర్థిక శాఖ పరిశీలిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ బ్లూమ్‌బర్గ్‌ తెలిపింది. కొవిడ్‌-19 ప్రభావంతో డీలాపడిన ఆర్థిక వ్యవస్థలో పునరుత్తేజం తీసుకొచ్చేందుకు చేపట్టాల్సిన చర్యలపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగానే దేశంలోకి కొత్తగా పెట్టుబడులు తీసుకొచ్చే కంపెనీలకు పన్ను ప్రోత్సాహకాలను కల్పించాలని భావిస్తోంది. 50 కోట్ల డాలర్లకు (దాదాపు రూ.3750 కోట్లు) మించి పెట్టుబడులు తీసుకొచ్చే కంపెనీలకు 10 ఏళ్ల పాటు పన్ను విరామాన్ని ప్రకటించేందుకు ఉన్న అవకాశాలను ఆర్థిక శాఖ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. బ్లూమ్‌బర్గ్‌ కథనం ప్రకారం.. కొత్తగా పెట్టుబడులు పెట్టే కంపెనీలు జూన్‌ 1 నుంచి మూడేళ్లలోగా కార్యకలాపాలను ప్రారంభించాలి. పన్ను విరామ ప్రయోజనాన్ని పొందాలంటే వైద్య పరికరాలు, ఎలక్ట్రానిక్స్‌, టెలికాం సామగ్రి, భారీ యంత్రపరికరాలు లాంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది.
తక్కువ పెట్టుబడులపై నాలుగేళ్లు
ఆహార శుద్ధి, జౌళి, తోలు, పాదరక్షలు లాంటి రంగాల్లో 10 కోట్ల డాలర్లకు (సుమారు రూ.750 కోట్లు) మించి పెట్టుబడుల పెట్టే కంపెనీలకు నాలుగేళ్ల పాటు పన్ను విరామం ప్రకటించే ప్రతిపాదన కూడా ఆర్థిక శాఖ పరిశీలనలో ఉందని నివేదిక పేర్కొంది. వచ్చే ఆరేళ్లకు కార్పొరేట్‌ పన్నును 10 శాతానికి పరిమితం చేయడం పైనా ప్రభుత్వం యోచన చేస్తునట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఆర్థిక శాఖ ఇంకా ఎటువంటి తుది నిర్ణయాన్ని తీసుకోలేదని బ్లూబ్‌బర్గ్‌ నివేదిక వెల్లడించింది.
భారత్‌లో తయారీ, పరిశోధనలకు రూ.300 కోట్ల పెట్టుబడి: ఫిలిప్స్‌
1000 నియామకాలు
భారత్‌లో తయారీ, పరిశోధన- అభివృద్ధి (ఆర్‌అండ్‌డీ) కార్యకలాపాల నిమిత్తం రూ.250- 300 కోట్ల వరకు పెట్టుబడిగా పెట్టనున్నామని ఎలక్ట్రానిక్‌ గృహోపకరణాల సంస్థ ఫిలిప్స్‌ వెల్లడించింది. ఎంఆర్‌ఐ, ఎక్స్‌రే యంత్రాలు తయారీ కోసం పుణె ప్లాంటును విస్తరించడంతో పాటు,  బెంగళూరులో కొత్త ప్రాంగణం నిర్మిస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం దేశీయంగా 6,000 మంది ఉద్యోగులు ఉండగా, రాబోయే రెండు మూడేళ్లలో మరో 1,000 మందిని నియమించుకునే ఉద్దేశంలో ఉన్నట్లు  తెలిపింది. ప్రస్తుతం సంక్షోభ పరిస్థితుల్లో తాము పనిచేస్తున్నప్పటికీ.. భవిష్యత్‌పైనా, పెట్టుబడుల పెట్టడం పైనా తాము దృష్టి సారిస్తున్నామని పేర్కొంది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.