నీలం సాహ్ని రాజీనామా ఆమోదం
close

తాజా వార్తలు

Updated : 27/03/2021 15:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నీలం సాహ్ని రాజీనామా ఆమోదం

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ముఖ్య సలహాదారుగా ఉన్న నీలం సాహ్ని తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆమె రాజీనామాను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. రాష్ట్ర ఎన్నికల సంఘం నూతన కమిషనర్‌గా నీలం సాహ్ని పేరును గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఖరారు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుత ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ పదవీకాలం ఈ నెల 31తో ముగియనుంది. ఆ వెంటనే నీలం సాహ్ని కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టే ముందు ఆమె ఈ పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుందని గవర్నర్‌ ఉత్తర్వుల్లో పేర్కొనడంతో తన పదవికి రాజీనామా చేశారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని