close

తాజా వార్తలు

Updated : 13/04/2021 10:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

తుపాకీ మిస్‌ఫైర్‌ ఘటనలో కొత్తకోణం

గొల్లపూడి: విజయవాడలోని గొల్లపూడిలో తుపాకీ మిస్‌ఫైర్‌ అయిన ఘటనలో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. క్షణికావేశంలో హోంగార్డే భార్యపై కాల్పులు జరిపినట్లు దర్యాప్తు అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.

ముఖ్యమంత్రి భద్రతా విభాగంలోని ఏఎస్పీ శశిభూషణ్‌ వద్ద హోంగార్డు వినోద్‌కుమార్‌ అసిస్టెంట్‌గా పని చేస్తున్నాడు. మూడు రోజుల క్రితం శశిభూషణ్‌ అనంతపురం వెళ్లారు. ఆ సమయంలో ఏఎస్పీ తుపాకీని హోంగార్డు వద్ద ఉంచారు. దాన్ని హోంగార్డు ఇంటికి తీసుకువచ్చాడు. మొదట ఇంట్లో తుపాకీ మిస్‌ఫైర్‌ అయినట్లు హోంగార్డు చెప్పాడు. బుల్లెట్‌.. అతడి భార్య సూర్యరత్నప్రభ గుండెల్లోకి దూసుకెళ్లింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. ఆదివారం అర్ధరాత్రి రెండు గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. భవానీపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

అయితే భార్యను బెదిరించే క్రమంలోనే ఆ తుపాకీతో హోంగార్డు కాల్పులు జరిపినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. బంగారు నగలు తాకట్టు పెట్టిన విషయంలో గత అర్ధరాత్రి భార్యభర్తల మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కేసు విచారణలో ఉందని త్వరలో పూర్తి వివరాలు తెలియజేస్తామని పశ్చిమ మండల ఏసీపీ హనుమంతరావు తెలిపారు.

 



 

ఇవీ చదవండి


 

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని