రాజమహేంద్రవరం జైలులో కరోనా కలవరం
close

తాజా వార్తలు

Published : 03/04/2021 01:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రాజమహేంద్రవరం జైలులో కరోనా కలవరం

రాజమహేంద్రవరం నేరవార్తలు: తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో కరోనా కలకలం రేగింది. జైల్లోని ఎనిమిది మంది రిమాండ్‌ ఖైదీలకు కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు జైలు సూపరింటెండెంట్‌ రాజారావు వెల్లడించారు. గురువారం ఒకరు అస్వస్థతకు గురి కావడంతో అతనితో పాటు మరో ఇద్దరికి పరీక్షలు చేయించినట్లు చెప్పారు. ఈ పరీక్షల్లో వారికీ కొవిడ్‌ నిర్దారణ అయింది. ఇవాళ మరో ఎనిమిది మందికి పరీక్షలు నిర్వహించగా వారిలో ఐదుగురికి కొవిడ్‌ పాజిటివ్‌గా తేలింది. బాధిత ఖైదీలను రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రిలోని కొవిడ్‌ కేంద్రంలో చికిత్స అందిస్తు్న్నట్లు జైలు సూపరింటెండెంట్‌ రాజారావు వెల్లడించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని