close

తాజా వార్తలు

Published : 16/01/2021 17:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఏపీలో కొత్తగా 114 కరోనా కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 25,542 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 114 కేసులు నిర్ధారణ అయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 8,85,824కి చేరింది. 24 గంటల వ్యవధిలో కరోనాతో ఎవరూ ప్రాణాలు కోల్పోలేదు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 7,139కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 326 మంది పూర్తిగా కోలుకోగా.. ఇప్పటివరకు రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 8,76,698కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,987 యాక్టివ్‌ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,25,40,181 కరోనా సాంపుల్స్‌ని పరీక్షించినట్లు ఆరోగ్య శాఖ బులెటిన్‌లో వెల్లడించింది.

జిల్లాల వారీగా కేసుల వివరాలు..

ఇవీ చదవండి..

వ్యాక్సినేషన్ విజయవంతం: డా.శ్రీనివాస్‌

భారత్‌లో టీకా పంపిణీ..ప్రపంచానికి పాఠాలు!



Tags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని