కొవిడ్‌-19కు మరో 21 మందులు!
close

తాజా వార్తలు

Published : 26/07/2020 07:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొవిడ్‌-19కు మరో 21 మందులు!

శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడి

లాస్‌ఏంజెలిస్‌: కరోనా వైరస్‌ నిరోధానికి ఏ ఔషధం పనిచేస్తుందన్న అంశంపై ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఇప్పటికే రెమ్‌డిసివిర్‌, క్లోరోక్విన్‌ లాంటి ఔషధాలను గుర్తించారు. ఇప్పుడు కొత్తగా మరో 21 ఔషధాలు కోవిడ్‌ కారక సార్స్‌-కోవ్‌-2పై పనిచేస్తాయని అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్‌ బర్న్‌హామ్‌ ప్రిబైస్‌ మెడికల్‌ డిస్కవరీ ఇన్‌స్టిట్యూట్‌ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వీరి పరిశోధనలు తుదిదశకు చేరుకున్నాయి. ప్రస్తుతం వాడకంలో ఉన్న 12,000 ఔషధాలను పరిశీలించిన తర్వాత అందులో 21 ఔషధాలకు వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోగల లక్షణాలున్నాయని వీరు నిర్ధారించారు. ఇందులో నాలుగు ఔషధాలను ఇప్పటికే కరోనా చికిత్సలో వాడుతున్న రెమ్‌డిసివిర్‌తో కలిసి వాడొచ్చని పేర్కొన్నారు. వీరి పరిశోధనాంశాలను ‘నేచర్‌’ పత్రిక ప్రచురించింది. ‘‘కరోనా బాధితుడు కోలుకునే సమయాన్ని రెమ్‌డిసివిర్‌ తగ్గించింది. కాకపోతే ఈ ఔషధం అందరిపైనా పని చేయడం లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని రెమ్‌డిసివిర్‌తో కలిసి వాడే ఔషధాలను కనిపెడుతున్నాం. 21 ఔషధాలను గుర్తించాం’’ అని అధ్యయనంలో పాల్గొన్న భారత సంతతికి చెందిన శాస్త్రవేత్త సుమిత్‌ చంద్ర తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని