నిరుద్యోగులకు కొత్త పథకం: పల్లా
close

తాజా వార్తలు

Updated : 10/03/2021 12:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నిరుద్యోగులకు కొత్త పథకం: పల్లా

నల్గొండ: ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉద్యోగాల కల్పనకు తెరాస ప్రభుత్వం కృషి చేసిందని పట్టభద్రుల ఎమ్మెల్సీ తెరాస అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం నల్గొండలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ సన్నాహక సమావేశంలో పల్లా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏప్రిల్‌ 1న ఎస్సీ, ఎస్టీ, బీసీ నిరుద్యోగుల కోసం కొత్త పథకాన్ని ప్రవేశ పెట్టనున్నట్లు తెలిపారు. పోలీసు ఉద్యోగాల్లో 25 శాతం మంది నల్గొండ జిల్లా వాసులేనని ఈ సందర్భంగా ఆయన వివరించారు. 

‘‘నిన్న టీఎన్‌జీవో, ఎన్‌జీవో, సెక్రటేరియల్‌, ఉపాధ్యాయ రాష్ట్ర సంఘ నాయకులతో ముఖ్యమంత్రి మాట్లాడారు. పీఆర్సీ ఇతర రాష్ట్రాల కంటే ఇస్తామని విశ్వాసం కల్పించారు. తెరాస అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల్లో లక్షా 30 వేల ఉద్యోగాలను ఇచ్చాం. రాష్ట్రానికి ఐటీఐఆర్‌ వస్తే లక్షల ఉద్యోగాలు వచ్చేవి. ప్రతిపక్షాలు దీనిపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నాయి. నల్గొండ జిల్లాలో మూడు మెడికల్‌ కాలేజీలతో పాటు చాలా అభివృద్ధి పనులు జరిగాయి’’ అని పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. 

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను తెలంగాణ రాష్ట్ర సమితి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. వరంగల్‌, నల్గొండ, ఖమ్మం సిట్టింగ్‌ స్థానాన్ని నిలబెట్టుకోవడంతో పాటు.. హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌లో పాగా వేసేందుకు ఎత్తులు పైఎత్తులతో దూసుకెళ్తోంది. ప్రచారానికి మరో రెండు రోజులే గడువు ఉండటంతో వ్యూహ, ప్రతివ్యూహాలకు మరింత పదును పెడుతోంది. గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా పార్టీ నాయకత్వం ప్రత్యేకంగా జాగ్రత్త పడుతోంది. ప్రతి 50 ఓటర్లకు ఒక నాయకుడి చొప్పున గులాబీ సైన్యాన్ని మోహరించింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని