ఆచూకీ చెబుతారా..  రూ.10 లక్షలిస్తాం..!
close

తాజా వార్తలు

Published : 16/06/2021 01:21 IST

ఆచూకీ చెబుతారా..  రూ.10 లక్షలిస్తాం..!

దిల్లీ: దిల్లీలోని ఇజ్రాయెల్‌ దౌత్య కార్యాలయం సమీపంలో ఈ ఏడాది జరిగిన బాంబు పేలుడు వ్యవహారంలో ఇద్దరు వ్యక్తులపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అనుమానం వ్యక్తం చేసింది. వారిని గుర్తించి వివరాలు చెప్పిన వారికి రూ.10 లక్షల చొప్పున నగదు బహుమతి ఇస్తామంటూ ప్రకటించింది. ఈ ఏడాది జనవరి 29న దిల్లీలోని ఏపీజే అబ్దుల్ కలాం రోడ్డులో ఉన్న ఇజ్రాయెల్‌ దౌత్య కార్యాలయానికి 150 మీటర్ల దూరంలో స్వల్ప బాంబు పేలుడు ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే.  అయితే ఎలాంటి ప్రాణహాని జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. బాంబు దాడికి కుట్ర పన్నిన ఇద్దరు వ్యక్తులను సీసీ ఫుటేజీ ద్వారా ఎన్‌ఐఏ అధికారులు గుర్తించారు. అయితే, ఈ కేసులో ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదు. సీసీ ఫుటేజీలో కనిపిస్తున్న అనుమానితులను పట్టుకొనేందుకు ఎన్‌ఐఏ తాజాగా ప్రజల సహకారం కోరింది.

అంతకుముందు ఈ కేసును దిల్లీ ప్రత్యేక పోలీసు విభాగం దర్యాప్తు చేసింది. అనంతరం ఫిబ్రవరిలో ఈ కేసును కేంద్రం ఎన్‌ఐఏకు అప్పగించింది. ఈ ఘటనపై ఇజ్రాయెల్‌ అప్పటి ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహుతో భారత ప్రధాని నరేంద్ర మోదీ చర్చించారు. ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదులను ఎలాగైనా పట్టుకొని శిక్షిస్తామని స్పష్టంచేశారు. ఈ కేసు దర్యాప్తు విషయంలో ఇరు దేశాల ప్రధానులూ గతంలో సంతృప్తి వ్యక్తంచేసిన విషయం తెలిసిందే.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని