నోయిడాలో రాత్రి కర్ఫ్యూ 
close

తాజా వార్తలు

Published : 08/04/2021 17:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నోయిడాలో రాత్రి కర్ఫ్యూ 

నేటి నుంచి ఏప్రిల్‌ 17 వరకు ఆంక్షలు

నోయిడా: నిత్యం లక్షకు పైగా కేసులతో దేశంలో కరోనా ఉగ్రరూపం చూపిస్తుండగా.. దానిని కట్టడి చేసే లక్ష్యంతో ప్రభుత్వాలు ఆంక్షల వైపు మొగ్గుచూపుతున్నాయి. ఇప్పటికే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్ తదితర రాష్ట్రాలు లాక్‌డౌన్, కర్ఫ్యూవంటి ఆంక్షలను విధించాయి. తాజాగా ఆ జాబితాలోకి ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడా చేరింది. రాత్రి 10 నుంచి ఉదయం ఐదు గంటల వరకు కర్ఫ్యూను విధిస్తూ స్థానిక యంత్రాంగం గురువారం ఆదేశాలు జారీచేసింది. నేటి నుంచి ఏప్రిల్ 17 వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. అయితే అత్యవసర సేవలకు మాత్రం మినహాయింపు ఉంది. మరోవైపు, మధ్యప్రదేశ్‌ కూడా లాక్‌డౌన్‌పై ప్రకటన చేసింది. రాష్ట్రంలోని అన్ని పట్టణ ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్ చౌహాన్ ప్రకటించారు. ప్రస్తుతం గుజరాత్, దిల్లీలో కూడా రాత్రి కర్ఫ్యూ నిబంధనలు అమలులో ఉన్నాయి.   

బుధవారం నోయిడాలో 125 కరోనా కొత్త కేసులు వెలుగుచూశాయి. ప్రస్తుతం అక్కడ 652 మంది వైరస్‌తో బాధపడుతున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని