ఏపీ నూతన ఎస్‌ఈసీగా నీలం సాహ్ని
close

తాజా వార్తలు

Updated : 26/03/2021 21:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఏపీ నూతన ఎస్‌ఈసీగా నీలం సాహ్ని

అమరావతి: ఏపీ నూతన ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ)గా సీఎం ముఖ్య సలహాదారు, మాజీ సీఎస్‌ నీలం సాహ్ని నియమితులయ్యారు. ఈ మేరకు గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌  ఆమె పేరును ఆమోదించారు. ఈనెల 31తో ప్రస్తుత ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ పదవీకాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో కొత్త ఎస్‌ఈసీ ఎంపిక కోసం ముగ్గురు విశ్రాంత ఐఏఎస్‌ అధికారుల పేర్లతో కూడిన దస్త్రాన్ని ప్రభుత్వం గవర్నర్‌కు పంపింది. వీరిలో నీలం సాహ్ని నియామకానికి గవర్నర్‌ ఆమోదం తెలిపారు.

నీలం సాహ్ని గతంలో ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌)గా పనిచేశారు. సీఎస్‌గా పదవీ విరమణ అనంతరం సీఎం ముఖ్యసలహాదారుగా ప్రభుత్వం నియమించింది. 1984 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన నీలం సాహ్ని.. ఉమ్మడి రాష్ట్రంలో పలు బాధ్యతలు నిర్వర్తించారు. మచిలీపట్నం అసిస్టెంట్‌ కలెక్టర్‌గా, టెక్కలి సబ్‌కలెక్టర్‌గా, నల్గొండ జేసీగా పనిచేశారు. ఆ తర్వాత పలు ప్రభుత్వ శాఖల్లో కార్యదర్శి హోదాలో విధులు నిర్వర్తించారు. అనంతరం కేంద్ర సర్వీసులకు వెళ్లిన ఆమె.. ఆ తర్వాత ఏపీ సీఎస్‌గా నియమితులయ్యారు.

 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని