కేంద్రహోంశాఖ కార్యదర్శికి నిమ్మగడ్డ లేఖ

తాజా వార్తలు

Updated : 25/01/2021 15:48 IST

కేంద్రహోంశాఖ కార్యదర్శికి నిమ్మగడ్డ లేఖ

అమరావతి: ఏపీలో పంచాయతీ పోరుకు సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లను వేగవంతం చేసింది. కేంద్రహోంశాఖ కార్యదర్శికి ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ లేఖ రాశారు. ఎన్నికలకు సహకరించబోమని కొన్ని ఉద్యోగ సంఘాలు అంటున్నాయని.. కేంద్ర ప్రభుత్వ సిబ్బందిని కేటాయించాలని కోరారు. ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు సూచించిన నేపథ్యంలో కేంద్ర సిబ్బందిని ఇవ్వాలని లేఖలో ఎస్‌ఈసీ విజ్ఞప్తి చేశారు. 

గతంలో విడుదల చేసిన షెడ్యూల్‌ ప్రకారం తొలి దశ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంకాని నేపథ్యంలో రీషెడ్యూల్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే.

ఇవీ చదవండి..

ఎన్నికలను రీషెడ్యూల్‌ చేసిన ఎస్‌ఈసీ

ఏపీలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సిందే: సుప్రీం


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని