close
Array ( ) 1

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ - 9 AM

1. శరణార్థులకు పౌరసత్వం

పొరుగునున్న మూడు దేశాల్లో మతపరమైన పీడనకు గురై, శరణార్థులుగా మన దేశానికి వచ్చిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వం కల్పించాలన్న కీలక బిల్లుకు లోక్‌సభ సోమవారం అర్ధరాత్రి 12 గంటలకు ఆమోదం తెలిపింది. ఉదయం నుంచి సుదీర్ఘంగా ఏడుగంటల పాటు చర్చ కొనసాగినఅనంతరం సభ ఆమోద ముద్ర వేసింది. ఒక్కో అంశం వారీగా ఓటింగ్‌ నిర్వహించారు. ప్రతిపక్షాలు ప్రతిపాదించిన సవరణలన్నీ వీగిపోయాయి. బిల్లుకు అనుకూలంగా 311 మంది, వ్యతిరేకంగా 80 మంది ఓటు వేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. భాజపాకు తెరాస షాక్‌!

కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ బిల్లును తెరాస వ్యతిరేకించడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. గత ఆరేళ్లలో కేంద్రం ప్రతిపాదించిన బిల్లును తెరాస వ్యతిరేకించడం, బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని విప్‌ జారీ చేయడం ఇదే మొదటిసారి. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి, ఇతర రాజకీయ పరిణామాల దృష్ట్యా తెరాస ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. హ్యాట్సాఫ్‌ కేసీఆర్‌

‘హైదరాబాద్‌లో దిశ ఉదంతం సమాజమంతా సిగ్గుతో తలవంచుకోవలసిన ఘటన. ఆమె తల్లిదండ్రుల బాధ చూశాక దారుణానికి పాల్పడిన వారిని కాల్చేసినా తప్పులేదని అందరం అనుకున్నాం. నాకూ ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఇలాంటి సంఘటనలు జరిగినపుడు ఒక తండ్రిగా ఎలా స్పందించాలి? నిందితులకు ఏ రకమైన శిక్ష పడితే ఉపశమనం కలుగుతుందో ఆలోచన చేయాలి.  దిశ ఘటనపై మీడియా, టీవీ వాళ్లు బాగా స్పందించారు. హ్యాట్సాఫ్‌ టు కేసీఆర్‌, తెలంగాణ పోలీసులు(నిందితుల ఎన్‌కౌంటర్‌ నేపథ్యంలో)’ అంటూ సీఎం జగన్‌ వ్యాఖ్యానించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. మా ఎమ్మెల్యేల్ని ఎన్‌కౌంటర్‌ చేయిస్తారా?

వైకాపా నాయకులకు గర్వం, అహంభావం పెరిగిపోయి నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారని తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు ధ్వజమెత్తారు. శాసనసభ నిర్వహించే విధానం దారుణంగా ఉందన్నారు. ‘పోడియం వద్దకు నిరసన తెలిపేందుకు వెళ్లిన మా ఎమ్మెల్యేల్ని ఎన్‌కౌంటర్‌ చేయిస్తామని వైకాపా మంత్రులు, ఎమ్మెల్యేలు హెచ్చరించారు. తెలంగాణలో నలుగుర్ని లేపేశారు, మీపైనా ఏదో కేసుపెట్టి లేపేస్తాం అని బెదిరించారు’ అని ఆయన మండిపడ్డారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. ఇక మెట్రో లైట్‌.. మెట్రో నియో!

ట్రాఫిక్‌ సమస్యలకు తక్కువ నిర్మాణ వ్యయం, స్వల్ప భూసేకరణతో కూడిన పర్యావరణహిత పరిష్కారాలను సూచించాలని తెలంగాణ పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ నిపుణులను కోరారు. ఆ దిశగా మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌, నాసిక్‌ నగరాలకు మహా మెట్రో సంస్థ రూపొందించిన ప్రతిపాదనలు బాగున్నాయని కితాబిచ్చారు. నగరంలో అర్టీసీ, మెట్రో, ఎంఎంటీఎస్‌, మెట్రో రెండోదశ మార్గాలు, ఇంటర్‌సిటీ బస్‌ టెర్మినళ్లు, ఓఆర్‌ఆర్‌ అవతలి ప్రాంతాలను కలిపే ప్రజారవాణా వ్యవస్థను అభివృద్ధి చేయడంపై నివేదిక ఇవ్వండి’ అని కేటీఆర్‌ సూచించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. నిందితుల్లో ఇద్దరు మైనర్లు?

దిశ హత్యాచారం కేసు నిందితుల్లో ఇద్దరు మైనర్లా? పాఠశాల బోనఫైడ్‌ సర్టిఫికెట్లలోని వారి వయసు ఆధారంగా ఇదే విషయం ఇప్పుడు చర్చనీయాంశమైంది. నిందితులకు సంబంధించిన పాఠశాల బోనఫైడ్‌ సర్టిఫికెట్లను ఎన్‌హెచ్‌ఆర్‌సీ బృందం సేకరించింది. అందులో ఒకరి పుట్టిన తేదీ 15-08-2002గా ఉంది. దీని ప్రకారం అతడి వయసు ప్రస్తుతం 17 సంవత్సరాల ఆరు నెలలు. ఆధార్‌కార్డులో మాత్రం పుట్టిన సంవత్సరం 2001గా నమోదై ఉంది. మరో నిందితుడి పుట్టిన తేదీ సర్టిఫికెట్‌లో 10-04-2004గా ఉంది. దీని ప్రకారం అతడి వయసు 15 సంవత్సరాల ఎనిమిది నెలలు. ఇలా తేదీలు వేర్వేరుగా ఉండడంతో ఏది వాస్తవమనే సందేహాలు నెలకొన్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. నిర్భయ దోషులకు త్వరలో ఉరి

దిల్లీ నిర్భయ ఘటనలో ముద్దాయిలను ఏ క్షణమైనా ఉరి తీసేందుకు రంగం సిద్ధమవుతోంది. ముద్దాయిలకు ఉరి ఖాయమని దాదాపు తేలిపోవడంతో దానికి అవసరమైన సన్నాహాలు మొదలయ్యాయి. ఉరి తీయడానికి వాడే దృఢమైన 10 తాళ్లను ఈ నెల 14 నాటికి తయారు చేయాల్సిందిగా కారాగార శాఖ నుంచి బిహార్‌లోని బక్సర్‌లో ఉన్న కేంద్ర కారాగారానికి గత వారమే ఆదేశాలు అందాయి. వీటిని నిర్భయ ముద్దాయిల కోసమే వాడబోతున్నారనేది స్పష్టమవుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. జీతాలు ఆలస్యం వ్యాపారంలో నష్టం

వేతనాల ఆలస్యం వల్లే చాలా మంది వ్యక్తులు రుణాలు తిరిగి కట్టలేకపోతున్నారని ఓ నివేదిక వెల్లడించింది. వ్యాపారాల్లో నష్టాలు రావడం మరో ప్రముఖ కారణంగా గుర్తించింది. పేటీఎం భాగస్వామిగా ఉన్న ఆర్థిక సాంకేతికత సేవల సంస్థ క్రెడిట్‌మేట్‌ ఈ నివేదిక రూపొందించింది. ఇందుకుగాను గత ఆరు నెలల్లో 30 రాష్ట్రాల్లో 40 రుణ సంస్థలు (చాలా వరకు ఎన్‌బీఎఫ్‌సీలే) ఇచ్చిన 2 లక్షల రుణాలపై విశ్లేషణ చేసింది. ప్రస్తుత మందగమనం దేశవ్యాప్తంగా రుణాల వసూళ్లపై ప్రభావం చూపుతోందని అభిప్రాయపడింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. వాతావరణం.. పోషకాహార లోపం!

నేడు ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న వివిధ జాడ్యాల్ని సునిశిత దృష్టితో పరిశీలిస్తూ.. వాటికి తనదైన కోణాల్లో పరిష్కారాల్ని సూచిస్తూ.. వాతావరణ మార్పులు, పోషకాహార లోపం నేటి ప్రపంచానికి పెను శాపాలని విశ్లేషిస్తున్నారు బిల్‌-మెలిండా గేట్స్‌ ఫౌండేషన్‌ సహాధ్యక్షుడు బిల్‌గేట్స్‌. నూతన ఆవిష్కరణలతోనే ఈ రంగాల్లో గణనీయ మార్పులు తేవచ్చంటూ నొక్కిచెబుతున్నారు. సామాజిక మాధ్యమాల విస్తృతిపైనా తన విశేష అభిప్రాయాలను బిల్‌గేట్స్‌ విప్రో సంస్థ ఛైర్మన్‌ రిషద్‌ ప్రేమ్‌జీతో పంచుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. ఒక్కరోజే 27 స్వర్ణాలు

దక్షిణ ఆసియా క్రీడల్లో భారత్‌ పతకాల్లో ట్రిపుల్‌ సెంచరీని సమీపించింది. సోమవారం ఒక్కరోజే మన అథ్లెట్లు 27 స్వర్ణాలు సహా 42 పతకాలు ఖాతాలో వేసుకున్నారు. దీంతో మరో రోజు మాత్రమే మిగిలున్న ఈ పోటీల్లో భారత్‌ 294 (159 స్వర్ణాలు, 91 రజతాలు, 44 కాంస్యాలు) పతకాలతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. పోటీల ఎనిమిదో రోజు బాక్సర్లు ఆరు స్వర్ణాలు, ఒక రజతం సాధించారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.