close
Array ( ) 1

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ - 9 AM

1. ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి

ఒడిశాలోని అంగుల్‌ జిల్లా గురుండ వద్ద జాతీయ రహదారిపై  ప్రమాదం జరిగింది. ప్రైవేటు బస్సు, జీపు ఢీ కొని ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను అంగుల్‌ జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రాయపూర్‌ నుంచి పూరీ వెళ్తుండగా జీపు ప్రమాదానికి గురైనట్లు సమాచారం.

2. ఝార్ఖండ్‌లో హేమంతం

అధికార భాజపాకి ఝార్ఖండ్‌లో ఎదురుదెబ్బ తగిలింది. శాసనసభ ఎన్నికల్లో ఆ పార్టీ విజయం సాధించలేకపోయింది. ఝార్ఖండ్‌ ముక్తి మోర్చా (జేఎంఎం)- కాంగ్రెస్‌- ఆర్జేడీ కూటమి అధికారాన్ని కైవశం చేసుకుంది. కూటమి నేతగా హేమంత్‌ సోరెన్‌ రెండోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించనున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు 41 స్థానాలు అవసరం కాగా జేఎంఎం 30 చోట్ల, కాంగ్రెస్‌ 16 స్థానాల్లో, ఆర్జేడీ ఒక స్థానంలో గెలవడంతో ఆ కూటమికి 47 స్థానాలు లభించినట్లయింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. పురపోరుకు వేళాయె..

తెలంగాణ పురపాలక ఎన్నికల నగారా మోగింది. మొత్తం 120 పురపాలక సంఘాలు, 10 నగరపాలక సంస్థలకు జనవరి 22వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. పురపాలక ఎన్నికల షెడ్యూలును రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం విడుదల చేసింది. జనవరి 7న రాష్ట్ర ఎన్నికల సంఘం పురపాలక ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చేస్తుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. పంచాయతీరాజ్‌ కమిషనర్‌ ఆదేశాలతోనే రంగు మార్పు

గ్రామ పంచాయతీ కార్యాలయాలకు రంగులు మార్చాలని ఏపీ పంచాయతీరాజ్‌ కమిషనర్‌ గిరిజాశంకర్‌ అందరు జిల్లా కలెక్టర్లకు ఆగస్టు 28న లేఖ పంపారని గుంటూరు జిల్లా కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ హైకోర్టుకు నివేదిక సమర్పించారు. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం పల్లపాడు గ్రామపంచాయతీ కార్యాలయానికి వైకాపా జెండా రంగులేయడాన్ని నిలువరించాలని అభ్యర్థిస్తూ రైతు ముప్ప వెంకటేశ్వరరావు హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలుచేశారు. దీంతో ధర్మాసనం విచారణ జరుపుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. 4 లేదా 5న టెట్‌ షెడ్యూల్‌

ఏపీలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) షెడ్యూల్‌ వచ్చే నెల నాలుగు లేదా ఐదో తేదీన విడుదల కానుంది. షెడ్యూల్‌ ఇచ్చిన వారం తర్వాత దరఖాస్తుల స్వీకరణ చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ కసరత్తు పూర్తి చేసింది. ప్రతి ఏడాది టెట్‌ను రెండు పర్యాయాలు నిర్వహించాల్సి ఉండగా గతేడాది ఫిబ్రవరిలో ఒక్కసారే నిర్వహించారు. ఈ ఏడాది ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్టీ) నిర్వహించనున్నందున ముందుగానే టెట్‌ నిర్వహణకు షెడ్యూల్‌ను రూపొందించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. తెలుగు రాష్ట్రాల్లోనూ ఎయిర్‌టెల్‌ వైఫై కాల్స్‌

వైఫై నెట్‌వర్క్‌ను వినియోగించుకుని వాట్సాప్‌, స్కైప్‌, గూగుల్‌ డుయో కాల్స్‌ చేసుకుంటున్నాం. అయితే వైఫైతో సాధారణ కాల్స్‌ చేసుకునే సదుపాయాన్ని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా రాష్ట్రాలకు కల్పించినట్లు భారతీ ఎయిర్‌టెల్‌ ప్రకటించింది. ఇళ్లు, కార్యాలయాల్లో ఉన్నపుడు, వైఫై సదుపాయం ఉంటే, ఎయిర్‌టెల్‌ స్మార్ట్‌ఫోన్ల వినియోగదారులు అదనపు వ్యయం ఏమీ లేకుండా కాల్స్‌ చేసుకోవచ్చు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం

8. సీఏఏ, ఎన్‌ఆర్‌సీ వేర్వేరు: కేంద్రం

పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ పౌర పట్టిక(ఎన్‌ఆర్‌సీ) ఒకదానితో ఒకటి ముడిపడినవి కావని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. సీఏఏతో భారతీయ ముస్లింలపై ప్రతికూల ప్రభావం పడుతుందంటూ ప్రచారం జరుగుతోందని.. అదంతా అవాస్తవమని తేల్చి చెప్పింది. కేంద్ర హోం శాఖ సోమవారం ఈ మేరకు రెండు వీడియో క్లిప్‌లను విడుదల చేసింది.

9. ఖషోగ్గీ హత్య కేసులో అయిదుగురికి మరణశిక్ష

‘వాషింగ్టన్‌ పోస్ట్‌’ కాలమిస్టు జమాల్‌ ఖషోగ్గీ హత్యలో నేరుగా సంబంధం ఉన్న అయిదుగురికి సంబంధిత న్యాయస్థానం మరణశిక్ష విధించింది. మరో ముగ్గురికి జైలు శిక్ష విధించినట్లు సౌదీకి చెందిన ఓ టీవీ ఛానల్‌ తెలిపింది. మరో ఇద్దరిని మాత్రం సరైన సాక్ష్యాలు లేని కారణంగా నిర్దోషులుగా ప్రకటించింది. ఇస్తాంబుల్‌లోని సౌదీ కాన్సులేట్‌ వద్ద 2018 అక్టోబరులో ఖషోగ్గీ హత్యకు గురయ్యారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. బుమ్రా వచ్చేశాడు..

గాయం కారణంగా మూడు నెలల పాటు ఆటకు దూరంగా ఉన్న జస్ప్రీత్‌ బుమ్రా.. కొత్త ఏడాదిలో అంతర్జాతీయ క్రికెట్లోకి పునరాగమనం చేయనున్నాడు. శ్రీలంకతో టీ20 సిరీస్‌, ఆ తర్వాత ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌ కోసం ప్రకటించిన భారత జట్లలో అతడికి స్థానం లభించింది. గాయం నుంచి కోలుకున్న శిఖర్‌ ధావన్‌ సైతం ఈ రెండు జట్లలో చోటు దక్కించుకున్నాడు. మరోవైపు ఈ ఏడాది ఐసీసీ వన్డే బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌ను భారత స్టార్లు విరాట్‌ కోహ్లి, రోహిత్‌శర్మ టాప్‌-2 స్థానాలతో ముగించారు. సోమవారం ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో కోహ్లి (887 పాయింట్లు) అగ్రస్థానం సాధించగా.. రోహిత్‌ (873 పాయింట్లు) రెండో ర్యాంకులో నిలిచాడు. i. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి  ii. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.