close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ - 9 AM

1. కేంద్రంతోనే సంకటం

‘‘కేంద్ర ప్రభుత్వ లోపభూయిష్ఠ విధానంతోనే తెలంగాణలో ఆర్థికంగా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. ఈ కారణంగా అనేక పథకాలకు అవాంతరం కలిగే అవకాశం ఉంది. ఇది మరింత దిగజారకుండా ఉండాలంటే స్వీయ నియంత్రణ పాటించడం తప్ప మరో గత్యంతరం లేదు’’ అని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమీక్షలో అభిప్రాయపడ్డారు. కేంద్రం తక్షణమే రాష్టానికి రావాల్సిన రూ.4531 కోట్లు విడుదల చేయాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ను ఆయన కోరారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. ఆర్టీసీ ఒప్పంద సిబ్బంది క్రమబద్ధీకరణ

తెలంగాణ ఆర్టీసీలోని ఒప్పంద (కాంట్రాక్టు) డ్రైవర్లు, కండక్టర్లకు మంచి రోజులు వచ్చాయి. 240 రోజులు కాంట్రాక్టు సిబ్బందిగా విధులు పూర్తిచేసుకున్న వారు సర్వీసు క్రమబద్ధీకరణకు అర్హులని ఆర్టీసీ ఇన్‌ఛార్జి ఎండీ సునీల్‌శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. అలాంటి వారిని గుర్తించి సంస్థ పూర్తిస్థాయి ఉద్యోగులుగా ప్రకటించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. స్వతంత్ర దర్యాప్తు తప్పనిసరి

‘తీర్పు చెప్పిన తూటా’ న్యాయంపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. దిశపై అత్యాచారం చేసి కిరాతకంగా చంపేసిన నిందితులు పోలీసు ఎన్‌కౌంటర్‌లో హతమవడంపై ఓ వైపు హర్షాతిరేకాలు వ్యక్తమవుతుంటే.. మరోవైపు ఇది సరైన న్యాయం కాదన్న వాదనలూ అంతేస్థాయిలో వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇంతకీ ఎన్‌కౌంటర్లపై జాతీయ మానవహక్కుల కమిషన్‌(ఎన్‌హెచ్‌ఆర్‌సీ)తో పాటు, సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఏమిటన్నది ఓ సారి చూస్తే.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. ‘నవశకం’..70% పూర్తి

ఏపీలో వైఎస్‌ఆర్‌ నవశకం సర్వే వేగంగా జరుగుతోంది. గత నెల 20న ప్రారంభించిన కార్యక్రమం ఈ నెల 20తో ముగియనుంది. ఇప్పటికే 70 శాతం పూర్తయ్యింది. మిగతా 30 శాతం మరో వారం రోజుల్లో పూర్తి చేసి వివిధ పథకాల కోసం వేర్వేరుగా కార్డుల జారీ చేసేలా అర్హుల జాబితాలు సిద్ధం చేయనున్నారు. దర్జీలు, పాస్టర్లు, రజకులు, నాయీ బ్రాహ్మణులతోపాటు కాపు నేస్తం కింద మహిళలకు కొత్తగా అందించే ఆర్థిక సాయం కోసమూ అర్హులను గుర్తిస్తున్నారు. సర్వే పూర్తయ్యాక వివరాలను గ్రామసభల్లో పెట్టి..అర్హులకు జనవరి 1 నుంచి వేర్వేరుగా కార్డులు జారీ చేయనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. వచ్చే వారంలో టెట్‌ షెడ్యూల్‌

ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) నిర్వహణపై ఈ వారంలో ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి డీఎస్సీ నిర్వహించాలని భావిస్తున్నందున టెట్‌ షెడ్యూల్‌ను రూపొందిస్తున్నారు. ఈ నెలలో నోటిఫికేషన్‌ జారీ చేసి, దరఖాస్తుల స్వీకరణ చేపట్టే అవకాశం ఉంది. జనవరి నెల చివరిలో పరీక్ష నిర్వహించనున్నారు. డీఎస్సీ-2018 పోస్టుల భర్తీ(కోర్టు కేసులు లేనివి) ఈ నెల చివరి నాటికి పూర్తి చేయనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. ‘రూలర్‌’ ట్రైలర్‌ వచ్చేసింది!

7. క్షమాభిక్ష పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నా!

నిర్భయ కేసు వ్యవహారం శనివారం మరో మలుపు తిరిగింది. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు సమర్పించిన క్షమాభిక్ష పిటిషన్‌ను తక్షణం ఉపసంహరించుకుంటున్నట్టు ఈ కేసులో శిక్ష పడ్డ వినయ్‌ శర్మ తెలిపాడు. తన అనుమతి, సంతకం లేకుండా పిటిషన్‌ను సమర్పించడమే ఇందుకు కారణమని చెప్పాడు. ఈ మేరకు రాష్ట్రపతికి లేఖ రాశాడు. పూర్త వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. సైన్యంలో చేరిన కశ్మీరీ యువత

జమ్మూ-కశ్మీర్‌కు చెందిన 404 మంది యువకులు సైన్యంలో చేరారు. ఏడాది పాటు శిక్షణ ఇచ్చిన అనంతరం వారిని జమ్మూ-కశ్మీర్‌ లైట్‌ ఇన్‌ఫాంట్రీ రెజిమెంట్‌లోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా శనివారం శ్రీనగర్‌లో శిక్షణానంతర కవాతు జరిగింది. జమ్మూ-కశ్మీర్‌ కేంద్ర పాలిత ప్రాంతంగా మారిన తర్వాత నిర్వహించిన తొలి కవాతు ఇది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. తీవ్ర చిక్కుల్లో స్థిరాస్తి రంగం

భారత స్థిరాస్తి, నిర్మాణ, మౌలిక రంగాలు తీవ్ర సమస్యల్లో ఉన్నాయని ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ హెచ్చరించారు. ఈ రంగాలకు రుణాలిస్తున్న బ్యాంకింగేతర ఆర్థిక కంపెనీల ఆస్తుల నాణ్యతను ఆర్‌బీఐ సమీక్షించాల్సిన అవసరం కూడా ఉందని ఒక ఆంగ్ల పత్రికకు రాసిన వ్యాసంలో ఆయన పేర్కొన్నారు. సెప్టెంబరు 2019 నాటికి స్థిరాస్తి విభాగంలో మొత్తం 115 దివాలా కేసులు నమోదయ్యాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. భారత్‌ @ 214

దక్షిణ ఆసియా క్రీడల్లో భారత్‌ పతకాల డబుల్‌ సెంచరీ కొట్టింది. శనివారం కూడా అదే జోరు కొనసాగించిన మన అథ్లెట్లు పతకాల పంట పండించారు. ఒక్క ఆరో రోజే భారత్‌ 29 స్వర్ణాలతో సహా 49 పతకాలు ఖాతాలో వేసుకుంది. ఈ క్రమంలో స్వర్ణాల శతకాన్ని కొట్టిన మన బృందం మొత్తం 214 (110 స్వర్ణ, 69 రజత, 35 కాంస్యాలు) పతకాలతో మిగిలిన దేశాలకు అందనంత ఎత్తులో నిలిచింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.