close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ - 9 AM

1. మండలికి మంగళం?

ఏపీ శాసన మండలి రద్దు దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ‘మండలి అవసరమా?’ అంటూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ గురువారం శాసనసభలో చేసిన వ్యాఖ్యలు రద్దుకు సంకేతాలని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. సోమవారం శాసనసభలో తీర్మానం పెట్టి రద్దు నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందంటున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. మీడియాపై కక్షగట్టి కేసుల కత్తి

మీడియా స్వేచ్ఛను ఉక్కుపాదంతో అణచివేసేందుకు 2430 వంటి జీవోలు తెచ్చిన జగన్‌ సర్కారు... ఇప్పుడు ఏకంగా ప్రత్యక్ష కార్యాచరణకు దిగింది. రాజధాని అమరావతి పరిధిలోని మందడం గ్రామంలో విధి నిర్వహణలో భాగంగా ఒక పాఠశాలలో ఫొటోలు తీసిన ముగ్గురు ఫొటో జర్నలిస్టులపై కేసులు పెట్టించింది. రైతుల ఉద్యమాన్ని కవర్‌ చేస్తున్నారన్న అక్కసుతో... ఉద్దేశపూర్వకంగానే ఒక మహిళా కానిస్టేబుల్‌తో ఫిర్యాదు చేయించి, ఐపీసీ 448, 354(సి), 509 రెడ్‌విత్‌ 34, 3(2)(వీఏ) ఎస్సీ, ఎస్టీలపై దాడుల నిరోధక చట్టంతోపాటు నిర్భయ చట్టం కింద కూడా కేసులు నమోదు చేయించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. తెల్లకార్డుదారులే 700 ఎకరాలు కొన్నారు

అమరావతి రాజధాని ప్రాంతంలో 799 మంది తెల్ల రేషన్‌కార్డుదారులు 700 ఎకరాల భూములు కొన్నారని సీఐడీ ఎస్పీ మేరీ ప్రశాంతి చెప్పారు. వీటి రిజిస్ట్రేషన్‌ ధర రూ.40 కోట్లని, బహిరంగ మార్కెట్‌లో రూ.200 కోట్లు ఉందని ఆమె వెల్లడించారు. భూములు కొనేంత ఆర్థిక స్థోమత వారికి ఎలా వచ్చింది? లేక వీరి పేరుతో ఎవరైనా బినామీలు రాజధానిలో భూములు కొన్నారా? అనే వ్యవహారంపై నిగ్గు తేల్చాలని ఆదాయపన్ను శాఖకు లేఖలు రాశామని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. నేటి నుంచి నాగోబా జాతర

సంప్రదాయాల సంగమమైన నాగోబా జాతర శుక్రవారం రాత్రి ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో ప్రారంభం కానుంది. ఆదివాసీ గిరిజనుల సంస్కృతి, సంప్రదాయం, ఆచారాలను కాపాడుకుంటూ మెస్రం వంశస్థులు ఇక్కడ ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు. ఈ జాతరకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల ఆదివాసీలు, గిరిజనులతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ ఒడిశా, మధ్యప్రదేశ్‌ నుంచి అధిక సంఖ్యలో తరలిరానున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. త్వరలోనే ఈడబ్ల్యూఎస్‌ కోటా అమలు

ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్‌) కింద 10 శాతం రిజర్వేషన్‌ను అమలు చేస్తామని తెలంగాణ ప్రభుత్వం త్వరలో ప్రకటించనుంది. ప్రవేశ పరీక్షల నోటిఫికేషన్లలోనే ఈ అంశాన్ని ప్రస్తావించనుంది. మరో అయిదారు రోజుల్లో కోటా అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేయనుంది. ఉన్నత విద్యా కోర్సుల్లో ఈడబ్ల్యూఎస్‌ కోటా తప్పకుండా అమలు చేయాల్సి ఉంటుందని ఉన్నత విద్యామండలి ఇప్పటికే ప్రకటించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6.  రాష్ట్రాల పన్నుల వాటా తగ్గింపు

ఆదాయం తగ్గి సతమతమవుతున్న కేంద్ర ప్రభుత్వంపై భారం తగ్గేలా 15వ ఆర్థిక సంఘం పలు సిఫార్సులు చేసింది.ప్రస్తుత పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని రాష్ట్రాల వాటాను 42 శాతం నుంచి తగ్గించాలని 15వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసినట్టు తెలిసింది. ఈ ఫలితంగా రాష్ట్రాల ఆర్థిక వనరులు తగ్గకుండా చూడడం కోసం పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థలకు కేంద్ర గ్రాంట్లు పెంచాలని కూడా పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. కర్ణాటకలో మూఢవిశ్వాస నిషేధ చట్టం

కర్ణాటకలో భాజపా ప్రభుత్వం మూఢ విశ్వాస నిషేధ చట్టాన్ని అమలులోకి తెచ్చేలా ఉత్తర్వులు జారీ చేసింది. 2017లో సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈ బిల్లుకు అంకురార్పణ చేయగా అప్పట్లో విపక్షంలో ఉన్న భాజపా వ్యతిరేకించింది. కొద్దిపాటి మార్పులతో తాజాగా దానికి ఆమోదం పలికింది. జనవరి 4 నుంచే అమలులోకి వచ్చేలా గురువారం ఉత్తర్వులు వెలువడ్డాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. పాముల నుంచే కరోనా కాటు

చైనాను వణికిస్తున్న కొత్తరకం కరోనా వైరస్‌ ప్రధానంగా పాముల నుంచి మనుషుల్లోకి ప్రవేశించిందని ఒక అధ్యయనంలో వెల్లడయింది. ప్రాణాంతకంగా మారిన వైరస్‌ ఇప్పటి వరకు 17 మందిని బలి తీసుకున్న విషయం తెలిసిందే. బీజింగ్‌ సమీపంలోని ఉత్తర హెబెయ్‌ ప్రావిన్స్‌లో గురువారం మరొకరు చనిపోవడంతో మృతుల సంఖ్య 18కి చేరింది. మొదటగా పాముల్లో ఈ వైరస్‌ ఉండేదని, రకరకాల ప్రాణుల్ని అక్రమంగా విక్రయించే టోకు మార్కెట్‌కు వచ్చినవారి ద్వారా ఇది మనుషుల శరీరంలోకి వ్యాపించి ఉంటుందని పరిశోధకులు భావిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి  

9. గర్భిణుల రాకపై అమెరికా ఆంక్షలు

అమెరికాలోకి వలసలను నియంత్రించడమే లక్ష్యంగా కఠిన విధానాలను అనుసరిస్తున్న ట్రంప్‌ సర్కారు.. తమ దేశానికి వచ్చే విదేశీ గర్భిణులపై తాజాగా ఆంక్షలు విధించింది. వీసా దరఖాస్తుదారులెవరైనా కాన్పు కోసమే అమెరికాకు రావాలనుకుంటున్నట్లు కాన్సులర్‌ అధికారులు గుర్తిస్తే, వారికి పర్యాటక వీసాను నిరాకరిస్తారు. నిజంగా వైద్య సేవల కోసమే గర్భిణులు రావాలనుకుంటే.. చికిత్స కోసం వచ్చే ఇతర సాధారణ విదేశీయుల తరహాలోనే వారిని పరిగణిస్తారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. అమీతుమీ..ఇక కివీస్‌తో!

సొంతగడ్డపై కంగారూలు విసిరిన కఠిన సవాల్‌ను ఛేదించారు. ఇక ప్రపంచకప్‌లో సెమీఫైనల్లో ఓడించిన న్యూజిలాండ్‌ను వారి సొంత గడ్డపై ఓడించాల్సిన సమయం ఆసన్నమైంది. కొత్త ఏడాదిలో తొలి విదేశీ సిరీస్‌కు సిద్ధమైంది కోహ్లీసేన. మూడు ఫార్మాట్లలో సాగే సుదీర్ఘపర్యటనలో భాగంగా అయిదు టీ20ల సిరీస్‌కు శ్రీకారం శుక్రవారమే. తొలి మ్యాచ్‌ మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రారంభం కానుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.