close
Array ( ) 1

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ - 9 AM

1. ఆ మాట నేను అనలేదు

‘అవసరమైతే ఎన్డీయేలో చేరతాం’ అని తాను అనలేదని ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక బహిరంగ లేఖ రాశారు. తాను ఆ మాటలు ఎక్కడ అన్నానో చూపించాలని ఆయన ప్రశ్నించారు. కాగా, విశాఖలో శుక్రవారం మంత్రి బొత్స సత్యనారాయణ నిర్వహించిన విలేకర్ల సమావేశంలో కేంద్ర రాష్ట్ర సంబంధాలపై విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఆ సంభాషణలు యథాతథంగా.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. మార్చి మొదటి వారంలో అసెంబ్లీ!

తెలంగాణ మంత్రిమండలి సమావేశం ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన ఆదివారం సాయంత్రం 4 గంటలకు ప్రగతిభవన్‌లో జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. శాసనసభ సమావేశాలు మార్చి మొదటివారంలో నిర్వహించే వీలుంది. ఈ తేదీలను మంత్రిమండలి సమావేశంలో ఖరారు చేస్తారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. ఒకే గొడుగు కిందకు నీటిపారుదల విభాగాలు

నీటిపారుదల శాఖను తెలంగాణ ప్రభుత్వం పునర్‌వ్యవస్థీకరించింది. భారీ, మధ్య, చిన్న తరహా నీటిపారుదల విభాగాలకు ముగింపు పలికింది. అన్ని విభాగాలకు కలిపి ఒక్కో జిల్లాకు ఒక్కో చీఫ్‌ ఇంజినీర్‌ను(సీఈ) నియమించింది. ఒక జిల్లా పరిధిలోని ప్రాజెక్టులను పాత జిల్లా వేదికగా ఒకే చోటికి చేర్చింది.ఈ మేరకు శనివారం నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రజత్‌ కుమార్‌ ఉత్తర్వులిచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. మూడు రాజధానులకు మా అనుమతి లేదు

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతేనని, అదే రాజధానిగా కొనసాగుతుందని భాజపా జాతీయ కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్‌ భాజపా సహ ఇన్‌ఛార్జ్‌ సునీల్‌ దేవ్‌ధర్‌ స్పష్టం చేశారు. శనివారం విశాఖలోని భాజపా కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానులను మా అనుమతితోనే, మాతో చర్చించిన తర్వాతే ఏర్పాటుచేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అది వాస్తవం కాదు. మేం ముందునుంచీ అభివృద్ధి వికేంద్రీకరణ కోరుతున్నాం తప్ప మూడు రాజధానులు ఏర్పాటుచేయాలని చెప్పలేదు’ అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి 

5. నేడే కేజ్రీవాల్‌ ప్రమాణస్వీకారం

హస్తిన ముఖ్యమంత్రిగా ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆదివారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకు దిల్లీలోని రాంలీలా మైదానం ముస్తాబైంది. ఉదయం 10 గంటలకు కేజ్రీవాల్‌ సీఎంగా, పలువురు శాసనసభ్యులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరై, మీ బిడ్డను ఆశీర్వదించండంటూ దిల్లీ వాసులకు కేజ్రీవాల్‌ పిలుపునిచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. యెమెన్‌లో సౌదీ వైమానిక దాడి: 31 మంది మృతి

సౌదీ నేతృత్వంలోని దళాలు యెమెన్‌పై వైమానిక దాడికి దిగాయి. జెట్‌ విమానాన్ని కూల్చడంతో 31 మంది పౌరులు మృతిచెందారు. ఈ ఘటనలో 12 మంది గాయపడ్డట్లు సమాచారం. ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితి ధ్రువీకరించింది. ఈ ఘటన యెమెన్‌ ఉత్తర ప్రావిన్స్‌లోని అల్‌ జాఫ్‌ ప్రాంతంలో చోటుచేసుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. కొవిడ్‌: 1662కు చేరిన మృతుల సంఖ్య

చైనా ప్రజల పాలిట మృత్యుశాపంగా మారిన కొవిడ్‌-19 విలయతాండవం ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా చైనాలో మరో 139 మందిని ఈ మహమ్మారి బలిగొంది. దీంతో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 1,662కు చేరింది. మరో 1,843 మంది కొత్తవారికి ఈ వైరస్‌ సోకింది. దేశవ్యాప్తంగా వైరస్ బాధితుల సంఖ్య 69,000 దాటింది. ఇక వైరస్‌ నుంచి 9,465 మంది విముక్తి పొందారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. చిన్ని గుండెకు సమస్యా... నేనున్నా!

గుండెకు చిల్లు పడిన ఒక్కో చిన్నారికి ఆపరేషన్‌ చేయించడానికి యాభై వేల నుంచీ రెండు లక్షల రూపాయల వరకూ ఖర్చు అవుతుంది. అంతటి ఖర్చును భరించే స్థోమత పేదలకు ఉండదు. అలాంటి పేదల దుఃఖాన్ని చూసి చలించిన వైద్యుడు రమణ దన్నపునేని... గుండె సంబంధ వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులకు ఉచితంగా ఆపరేషన్లు చేస్తూ అండగా నిలుస్తున్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. కారు నంబరు రూ.132 కోట్లు..!

కారో బైకో కొనుక్కున్నప్పుడు నంబర్‌ప్లేట్‌లో లక్కీ నంబర్లు వస్తే బాగుండునని చాలామందే అనుకుంటారు. కానీ కొందరు మాత్రం ఎంత ఖర్చైనా ఆ లక్కీ నంబర్లను దక్కించుకుని తీరతారు. అలా, లక్షలు వెచ్చించి అదృష్ట సంఖ్యల్ని కార్ల నంబర్‌ప్లేట్ల మీదకు తీసుకొచ్చుకున్నారు కొందరు. ఇంతకీ వాళ్లెవరూ... ఆ నంబర్లు ఏంటీ అంటే... పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి 

10. మీరూ కావొచ్చు... సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌!

సర్టిఫికెట్‌లకీ, నైపుణ్యాలకీ సంబంధంలేదనీ తమ కంపెనీలో ఇంజినీరింగ్‌ పట్టా లేనివాళ్లు చాలామంది ఉన్నత స్థానాల్లో ఉన్నారనీ చెబుతారు ఆపిల్‌ సీఈఓ టిమ్‌ కుక్‌. ఈ మాట ఆయనది మాత్రమే కాదు, దాదాపు టెక్‌ పరిశ్రమలో ఉండే అందరిదీనూ. అందుకే ‘ఎవరైనా కోడింగ్‌ నేర్చుకోవచ్చు, సాఫ్ట్‌వేర్‌ రంగంలో స్థిరపడొచ్చు’ అంటున్నాయి చాలా సంస్థలు. వాటి వివరాల కోసం క్లిక్‌ చేయండి 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.