close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 28/05/2020 21:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ - 9 PM

1. బిల్డ్‌ ఏపీ పేరుతో సోల్డ్‌ ఏపీగా మార్చారు

తెలుగుదేశం పార్టీ పాలనలో అనేక కంపెనీలను రాష్ట్రానికి తీసుకొచ్చామని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ తెలిపారు. మహానాడు రెండో రోజులో భాగంగా ఆయన నేతలతో మాట్లాడారు. ఎన్నో ఇబ్బందులు పడి హెచ్‌సీఎల్‌ సంస్థను తీసుకొచ్చామన్నారు. రాష్ట్రంలో ఉపాధి లేక యువత అనేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. విద్యుత్‌ ధరల పెంపు వెనుక పెద్ద కుంభకోణమే ఉందని.. యూనిట్‌ విద్యుత్‌ను అధిక ధరకు కొనుగోలు చేస్తున్నారని లోకేశ్‌ ధ్వజమెత్తారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. ఫైరింజన్లు, జెట్టింగ్‌ మిషన్లు సిద్ధంగా ఉన్నాయ్‌

మిడతల దండు రాష్ట్రంలోకి ప్రవేశించకుండా అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. మిడతలు రాష్ట్రంలోకి వస్తే తీసుకోవాల్సిన చర్యలపై అధికారులను అప్రమత్తం చేశారు. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దు జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉన్నారని.. ఫైరింజన్లు, జెట్టింగ్‌ మిషన్లు, పెస్టిసైడ్లను సిద్ధంగా ఉంచారని కేసీఆర్‌ స్పష్టం చేశారు. మిడతల దండు కదలికలను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని సీఎం కేసీఆర్‌ వివరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. షూటింగ్‌లకు త్వరలోనే అనుమతులు

తెలంగాణలో షూటింగ్‌లకు త్వరలోనే అనుమతులు ఇస్తామని రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖమంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ తెలిపారు. గురువారం మంత్రి తలసానితో సినిమా, టెలివిజన్‌ రంగ ప్రముఖులు ఎంసీహెచ్‌ఆర్డీలో సమావేశం అయ్యారు. లాక్‌డౌన్‌ తర్వాత షూటింగ్‌లు ఎలా చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సెట్‌లో ఎంతమంది ఉండాలి? ఎంతసేపు షూటింగ్‌ చేయాలి? తదితర అంశాలపై ఈ సందర్భంగా సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం మంత్రి తలసాని విలేకరులతో మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. వలస కూలీల అంశంపై సుప్రీం కీలక ఆదేశాలు

లాక్‌డౌన్‌ వేళ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వలస కూలీల అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. వలస కూలీలప్రయాణానికి సంబంధించి ఎలాంటి రవాణా ఛార్జీలూ వసూలు చేయకూడదని పేర్కొంది. వారిని గుర్తించి, సదుపాయాలు కల్పించాలని రాష్ట్రాలకు సూచించింది. వలస కూలీల అంశంపై రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు చర్యలు తీసుకుంటున్నప్పటికీ అనేక లోపాలు తమ దృష్టికి వచ్చాయని ధర్మాసనం పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. ఇక క్షణాల్లోనే PAN నెంబర్‌!

పాన్‌ నెంబరును క్షణాల్లోనే పొందే ఈ-పాన్‌ సౌకర్యాన్ని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ఈ రోజు అధికారికంగా ప్రారంభించారు. ఆధార్‌ కార్డు నెంబరుతోపాటు ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్‌ నెంబర్‌ ఉన్న వారికి మాత్రమే ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. ఎలాంటి పేపర్‌ వర్క్‌ అవసరం లేని ఈ ఎలక్ట్రానిక్‌ పాన్‌ కార్డుకు ఎలాంటి రుసుము కూడా చెల్లించనవసరం లేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. దిల్లీ ఎయిమ్స్‌లో 195మంది సిబ్బందికి కరోనా

ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌)లో వైద్య సిబ్బందికి మహమ్మారి సోకడం కలకలం రేపుతోంది. దిల్లీ ఎయిమ్స్‌లో ఇప్పటివరకు 195 సిబ్బంది వైరస్‌ బారిన పడ్డారు. గత రెండు రోజుల వ్యవధిలోనే 50 మంది సిబ్బందికి ఈ మహమ్మారి సోకడం గమనార్హం. వీరిలో ఎంబీబీఎస్‌ విద్యార్థితో పాటు రెసిడెంట్‌ వైద్యులు, నర్సులు, మెస్‌ వర్కర్లు, లేబోరేటరీ సిబ్బంది, సాంకేతిక సహాయకులు, శానిటేషన్ వర్కర్లు, భద్రతా విభాగాల్లో పనిచేసే సిబ్బంది ఉన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7.  సీఆర్‌పీఎఫ్‌ సిబ్బందే టార్గెట్‌?

పుల్వామా తరహాలో ఉగ్రవాదులు రచించిన పేలుడు కుట్రను భారత భద్రతా దళాలు ఈ ఉదయం భగ్నం చేసిన విషయం తెలిసిందే. అయితే, దీనికి జైషే మహమ్మద్‌ ఉగ్రవాద సంస్థే పథకం రచించినట్లు తమకు సమాచారం ఉందని పోలీసులు వెల్లడించారు. ముఖ్యంగా 20 సీఆర్‌పీఎఫ్‌ వాహనాలను ఉగ్రవాదులు టార్గెట్‌ చేశారని కశ్మీర్‌ పోలీస్‌ ఐజీ విజయ్‌ కుమార్‌ ప్రకటించారు. ఈ 20 వాహనాల కాన్వాయ్‌లో ఉండే దాదాపు 400 భద్రతా సిబ్బందే వీరి టార్గెట్‌గా పోలీసులు అనుమానిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. అది ధోనీ ఇష్టం.. బలవంతం చేయొద్దు!

క్రికెట్‌కు ఎప్పుడు వీడ్కోలు పలకాలో నిర్ణయం తీసుకోవాల్సింది టీమ్‌ఇండియా మాజీ సారథి ఎంఎస్‌ ధోనీయేనని మాజీ కోచ్‌ గ్యారీ కిర్‌స్టెన్‌ అన్నారు. స్వయంగా ఆ నిర్ణయం ప్రకటించే అర్హతను అతడు సంపాదించుకున్నాడని తెలిపారు. 2011 ప్రపంచకప్‌ గెలిచిన భారత జట్టు తనకెన్నో మధుర స్మృతులు అందించిందని పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. జూన్‌ 1కే కేరళకు రుతుపవనాలు..!

నైరుతి రుతుపవనాలు ఈసారి జూన్‌ 1నే వస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకేందుకు అనుకూలమైన వాతావరణం ఉందని కేరళ వాతావరణ విభాగం వెల్లడించింది. అయితే, నైరుతి రుతుపవనాల ఆగమనం ఈసారి కాస్త ఆలస్యం కానుందని వాతావరణశాఖ తొలుత అంచనా వేసింది. జూన్‌ 5న కేరళ తీరాన్ని తాకవచ్చని ప్రకటించింది. దేశంలో ఈసారి సాధారణ వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ శాఖ గత నెలలోనే ప్రకటించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. లక్ష దాటిన అమెరికా కరోనా మృతుల సంఖ్య

అమెరికాలో కరోనా వైరస్‌ వ్యాప్తి రోజురోజుకు తీవ్రమవుతోంది. అమెరికాలో కరోనా కారణంగా ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య లక్షకు చేరిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. కరోనా మృతుల కుటుంబాలకు ట్రంప్‌ ప్రగాఢ సానుభూతి తెలిపారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.