Covid: 90% భారత్‌లో అధిక పాజిటివిటీ రేటు!
close

తాజా వార్తలు

Updated : 12/05/2021 13:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Covid: 90% భారత్‌లో అధిక పాజిటివిటీ రేటు!

వెల్లడించిన కేంద్ర ఆరోగ్యశాఖ

దిల్లీ: దేశవ్యాప్తంగా రెండో దశ ఉద్ధృతి ఇంకా ఆందోళనకరంగానే ఉంది. భారత్‌లో దాదాపు 90 శాతం ప్రాంతాల్లో కొవిడ్‌ పాజిటివిటీ రేటు అధికంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మొత్తం 734 జిల్లాలకుగానూ 640 జిల్లాల్లో పాజిటివిటీ రేటు కేంద్రం నిర్దేశించిన ఐదు శాతం పరిమితి కంటే ఎక్కువగా ఉన్నట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ పాజిటివిటీ రేటు సరాసరి 21 శాతం ఉన్నట్లు వెల్లడించింది.

దేశంలో కరోనా పాజిటివిటీ రేటు అధికంగా ఉన్న రాష్ట్రాల్లో గోవా తొలిస్థానంలో ఉండగా, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్‌, హరియాణా, కర్ణాటక రాష్ట్రాల్లో పాజిటివిటీ అధికంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది. ప్రస్తుతం గోవాలో కరోనా పాజిటివిటీ రేటు దాదాపు 48 శాతం ఉండగా హరియాణాలో 37 శాతంగా ఉంది. హిమాచల్‌ప్రదేశ్‌, నాగాలాండ్‌లో పాజిటివిటీ రేటు ఇప్పుడిప్పుడే పెరుగుతోందని పేర్కొంది. మహారాష్ట్ర, దిల్లీ, ఛత్తీస్‌గఢ్‌ సహా 18 రాష్ట్రాల్లో మాత్రం ఓ మాదిరిగా లేదా రోజువారీ కేసుల్లో తగ్గుదల కనిపిస్తోందని పేర్కొంది. బెంగళూరు అర్బన్‌, చెన్నై, ఎర్నాకులం, మలప్పురం నగరాల్లో కరోనా వైరస్‌ తీవ్రత క్రమంగా పెరుగుతున్నట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది.

పాజిటివిటీ 10 శాతం మించిన ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ విధించాలని కేంద్రం గతంలోనే సూచించిన విషయం తెలిసిందే. అయితే, ప్రస్తుతం మెజారిటీ రాష్ట్రాలు లాక్‌డౌన్‌ విధించగా.. కొన్ని రాష్ట్రాల్లో మాత్రం పాక్షిక లాక్‌డౌన్‌ కొనసాగుతోంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని