నితిన్‌ పెళ్లి డేట్‌ ఫిక్స్‌!
close

తాజా వార్తలు

Published : 02/07/2020 10:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నితిన్‌ పెళ్లి డేట్‌ ఫిక్స్‌!

హైదరాబాద్‌: కథానాయకుడు నితిన్‌ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఈ నెల 26నే ఆయన పెళ్లికి ముహూర్తంగా ఖరారైనట్టు తెలిసింది. హైదరాబాద్‌లోనే పరిమిత సంఖ్యలో బంధు మిత్రుల సమక్షంలో ఈ వేడుకని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. నితిన్‌ తన స్నేహితురాలు షాలినిని మనువాడనున్న విషయం తెలిసిందే. వీరి పెళ్లి ఏప్రిల్‌ నెలలోనే జరగాల్సి ఉండగా, కరోనా విజృంభణ కారణంగా వాయిదా వేశారు.

పరిస్థితులు ఇప్పట్లో సాధారణ స్థితికి వచ్చేలా కనిపించకపోవడంతో ఇరు కుటుంబాల వారు త్వరలోనే పెళ్లి  వేడుకని నిర్వహించాలని నిర్ణయించారు. ఆ మేరకు పెళ్లి పనుల్ని షురూ చేశాయి. నితిన్ ఈ ఏడాది ‘భీష్మ’ చిత్రంతో విజయాన్ని అందుకున్నాడు ‌.  ప్రస్తుతం ఆయన ‘రంగ్‌ దే’, ‘అంధాధూన్‌’ రీమేక్‌ చిత్రాలతో పాటు చంద్రశేఖర్‌ యేలేటి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వీటితో పాటు దర్శకుడు కృష్ణ చైతన్యతో ‘పవర్‌ పేట’ అనే ఓ చిత్రాన్ని చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని