close

తాజా వార్తలు

Updated : 08/03/2021 19:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో రాష్ట్రానికి ఈక్విటీ షేర్‌ లేదు: కేంద్రం

దిల్లీ: విశాఖ ఉక్కు కర్మాగారం వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. లోక్‌సభలో వైకాపా ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో రాష్ట్రానికి ఈక్విటీ షేర్‌ లేదని.. వందశాతం పెట్టుబడులు ఉపసంహరిస్తున్నట్లు ఆమె తెలిపారు. మెరుగైన ఉత్పాదకత కోసమే విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేస్తున్నట్లు  పేర్కొన్నారు.

ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి పెంపు కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె వెల్లడించారు. భాగస్వాములు, ఉద్యోగులు షేర్లు కొనుగోలు చేసేలా ప్రత్యేక ప్రతిపాదనలు చేసినట్లు చెప్పారు. ఆర్‌ఐఎన్‌ఎల్‌(రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌)లో రాష్ట్ర ప్రభుత్వానికి ఈక్విటీ షేర్‌ లేకపోయినా, పలు విషయాల్లో అవసరమైనప్పుడల్లా ఏపీ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామని, ఏదైనా విషయంలో ప్రభుత్వ జోక్యం అవసరమైతే కోరుతున్నామని నిర్మలా సీతారామన్‌ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడంతో ఏపీలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. భాజపా మినహా అన్ని రాజకీయ పార్టీలు, వివిధ ప్రజా సంఘాలు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నాయి.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని