ఆ రహస్యాన్ని బయటపెట్టిన నిత్యామేనన్‌
close

తాజా వార్తలు

Published : 07/09/2020 15:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ రహస్యాన్ని బయటపెట్టిన నిత్యామేనన్‌

హైదరాబాద్‌: ‘‘తెరపై నటిస్తున్నప్పుడు నాలో కనిపించే సహజమైన మెరుపు నా మనసు నుంచి వస్తుంది. అందులో ఒక రకమైన ఎనర్జీ ఉంటుంది’’ అంది నటి నిత్యా మేనన్‌. సహజత్వం నిండిన  నటనకు చిరునామా ఆమె. మరి ‘మీ నటనలో ఇంతటి   సహజత్వం ఎలా సాధ్యమవుతుంది?’ అని నిత్యను ప్రశ్నిస్తే.. దాని వెనకున్న రహస్యాన్ని ఇలా బయటపెట్టింది.

‘‘నా జీవితంలో సినిమాలే కాదు.. మరెన్నో విషయాలకూ ప్రాధాన్యం ఉంది. అలా ఇష్టమైన వాటిని చేసినప్పుడు నా మనసు   సంతోషంతో నిండిపోతుంది. అలాగే నాకు నచ్చిన పాత్రలు చేసేటప్పుడు అంతే సంతోషం మనసులో ఉంటుంది. ఆ   సంతోషమే నా ముఖంపై ప్రతిఫలిస్తుంది. మీరే గమనించి ఉంటారు. నా కళ్లలో ఓ మెరుపు ఉంటుంది. అది ఆ పాత్రకు తగ్గట్లుగా నటన కాదు. మీరన్న సహజమైన ఆ మెరుపు.. నా మనసు నుంచి వస్తుంది. అది నాకు ఒకరకమైన శక్తిని అందిస్తుంది. అది నా నుంచి ప్రేక్షకులకు చేరుతుంది’’ అని చెప్పుకొచ్చింది నిత్య మేనన్‌. ప్రస్తుతం ఆమె తెలుగులో ఓ  పీరియాడికల్‌ సైన్స్‌ ఫిక్షన్‌ చిత్రంలో నటించనుంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని