close

తాజా వార్తలు

Updated : 27/11/2020 10:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

తిరుపతి సమీపంలో వాయుగుండం

అమరావతి: చిత్తూరు జిల్లా తిరుపతి సమీపంలో వాయుగుండం కొనసాగుతోంది. తిరుపతికి ఉత్తరంగా 35 కిలోమీటర్లు, నెల్లూరుకు నైరుతిగా 70 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. కొద్ది గంటల్లో మరింతగా బలహీనపడి  అల్పపీడనంగా మారనుందని వాతావరణశాఖ తెలిపింది. వాయుగుండం ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముంది. చిత్తూరు, నెల్లూరు, కడప, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని వాతావరణశాఖ వెల్లడించింది.

చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి నియోజకవర్గంలో నివర్‌ తుపాను ప్రజలను అతలాకుతలం చేసింది. యర్రావారిపాళ్యం మండలంలోని చెరువులు, కుంటలు, వాగులు పొంగి పొర్లడంతో వలసపల్లి, బోడెవాండ్ల పల్లి, భాకరాపేటకు వెళ్లే మార్గాలు పూర్తిగా జలమయమయ్యాయి. రామచంద్రాపురంలోని రాయలచెరువు ప్రవాహం ఎక్కువగా ఉండటంతో పోలీసులు, రెవెన్యూ అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి పునరావాస కేంద్రాలకు తరలించారు.  మరో వైపు భీమా, స్వర్ణముఖి నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. నాగయ్యగారిపల్లి నుంచి చంద్రగిరికి వెళ్లే  దారి, కొంగరవారిపల్లి- మామిడిమాంగడ్డలకు వెళ్లే దారులు కొట్టుకుపోవడంతో 9 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. స్వర్ణముఖి నది పరివాహక ప్రాంతంలోని నడింపల్లి గ్రామం నీట మునిగి జనజీవనం స్తంభించింది.


Tags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని