
తాజా వార్తలు
తమిళనాడు తీరం వైపు దూసుకొస్తున్న నివర్
అమరావతి: నివర్ తుపాను తమిళనాడు తీరం వైపు దూసుకొస్తోంది. గంటకు 6 కిలోమీటర్ల వేగంతో వాయువ్యదిశగా కదులుతోంది. ప్రస్తుతం తమిళనాడులోని కడలూరుకు 290 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 300 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైనట్టు ఐఎండీ తెలిపింది. కొద్ది గంటల్లో పెనుతుపానుగా బలపడనుందని వాతావరణశాఖ అంచనా వేసింది. ఈ రోజు రాత్రికి కారైక్కాల్, మామల్లపురం మధ్య పుదుచ్చేరి సమీపంలో తుపాను తీరం దాటుతుందని స్పష్టం చేసింది.
దీని ప్రభావంతో ఇప్పటికే చెన్నై సహా తమిళనాడులోని కోస్తాజిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తమిళనాడులో 12 సెం.మీ వర్షం నమోదైనట్టు అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తో జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై ఉంది. నెల్లూరు, చిత్తూరు తదితర ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. తుపాను ప్రభావంతో తీర ప్రాంతంలో 65 నుంచి 75 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముంది. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 145 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. సముద్రం అల్లకల్లోలంగా ఉందని, అలలు 3 నుంచి 5 మీటర్ల ఎత్తు ఎగసిపడుతున్నాయని అధికారులు వెల్లడించారు. లోతట్టు ప్రాంతాల్లోకి సముద్రపునీరు చొచ్చుకొచ్చే అవకాశముందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది.
చిత్తూరు జిల్లాలో విద్యా సంస్థలకు సెలవు..
నివర్ తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ ప్రకటనతో చిత్తూరు జిల్లా అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. జిల్లాలో ఇవాళ, రేపు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించినట్టు జిల్లా కలెక్టర్ తెలిపారు. తిరుమలతో పాటు జిల్లా వ్యాప్తంగా ఉదయం నుంచి జల్లులతో కూడిన వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంత వాసులను సహాయ కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.
నెల్లూరు జిల్లాలో...
నివర్ తుపాను దృష్ట్యా నెల్లూరు జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. 12 మత్స్యకార మండలాల్లోని 118 గ్రామాల్లో ముందస్తు చర్యలు చేపట్టారు. మత్స్యకారులు వేటకు వెళ్ల వద్దని జిల్లా కలెక్టర్ చక్రధర్‌బాబు సూచించారు. మత్స్యకారుల పడవలు, వలలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. తుపాను సహాయక చర్యల కోసం జిల్లా కేంద్రంలో 1077 టోల్ ఫ్రీ నెంబరు ఏర్పాటు చేశారు.
ప్రకాశం జిల్లాలో...
నివర్ తుపాను దృష్ట్యా ప్రకాశం జిల్లాలో అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం 30 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ప్రకాశం జిల్లాకు పంపింది. తీర మండలాల్లో 11 మంది ప్రత్యేక అధికారులను నియమించారు. కలెక్టర్ ఆదేశాలతో క్షేత్రస్థాయిలో ప్రత్యేక అధికారులు విధులు నిర్వహిస్తున్నారు.
జనరల్
రాజకీయం
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- ఇండస్ట్రీలో నాకు పోటీ ఎవరో ఇన్నాళ్లకు తెలిసింది
- సమాధానం కావాలా..నీ దేశానికి వెళ్లిపో
- శెభాష్ నట్టూ..కసి కనిపిస్తోంది: రోహిత్
- ‘ఉప్మాపాప’కు థాంక్స్ చెప్పిన రామ్..
- మధుమేహులూ.. మరింత జాగ్రత్త!
- యాష్ లేకున్నా సుందర్ నష్టం చేశాడు: ఆసీస్
- మహేశ్‌బాబు అందానికి రహస్యమదే: విష్ణు
- ఒక్క వికెట్ తీస్తేనేం..సిరాజ్ సూపర్: సచిన్
- ‘సలార్’ ప్రారంభోత్సవ వీడియో చూశారా..?
- పశ్చాత్తాపం లేదు.. అలానే ఆడతా: రోహిత్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
