IPL వాయిదా తప్ప మరో మార్గమేదీ?
close

తాజా వార్తలు

Published : 05/05/2021 17:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

IPL వాయిదా తప్ప మరో మార్గమేదీ?

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ను వాయిదా వేయడం కన్నా మరో ప్రత్యామ్నాయం లేకుండా పోయిందని ఇంగ్లాండ్‌ మాజీ క్రికెటర్‌ నాసర్ హుస్సేన్‌ అన్నాడు. క్రికెటర్లేమీ తెలివి తక్కువ వారు కాదని, భారత్‌లో కొవిడ్‌-19 పరిస్థితి వారికి తెలుసని పేర్కొన్నాడు. యూఏఈలో టోర్నీ నిర్వహిస్తే బాగుండేదని పేర్కొన్నాడు. ప్రాణ వాయువు కోసం ఆస్పత్రుల ముందు బతిమిలాడుతున్న వారిని ఆటగాళ్లు చూశారని, మైదానాల ముందూ ఉపయోగించని అంబులెన్స్‌లను చూసుంటే వారు ఇబ్బంది పడేవాళ్లని వెల్లడించారు.

‘ఐపీఎల్‌ను వాయిదా వేయడం కన్నా మరో ప్రత్యామ్నాయం లేదు. బయో బుడగ బలహీన పడ్డాక అది తప్పదు. జరిగిందేదో జరిగిపోయింది. ఇది క్రికెట్‌ కన్నా ఎక్కువ చర్చనీయాంశం అయ్యేది. ఆటగాళ్లు మూర్ఖులు, కఠినులు కారు. భారత్‌లో ఏం జరుగుతుందో వారికి తెలుసు. ప్రాణవాయువు, ఆస్పత్రుల్లో పడకల కోసం బతిమిలాడుతున్న దృశ్యాలు చూసి వారెలా ఆడగలరు’ అని హుస్సేన్‌ అన్నారు.

‘ప్రజలు మరణిస్తుంటే ఆటనెలా చూడగలరు. ఆటగాళ్లను నేను విమర్శించడం లేదు. ఏదేమైనా టోర్నీని వాయిదా వేయాల్సిందే. భారత్‌లో నిర్వహించడమే నిర్వాహకులు చేసిన తప్పు. ఆరు నెలల క్రితం యూఏఈలో వారు అద్భుతంగా లీగ్‌ను నిర్వహించారు. అప్పుడు కొవిడ్‌ తక్కువగా ఉంది. బుడగల విషయంలో రాజీ పడలేదు. నిజమే, చెప్పడం సులువే. వైరస్‌ ఉద్ధృతి ఎక్కువగా ఉన్న సమయంలో లీగ్‌ నిర్వహించడం పట్ల ఫీలయ్యే ఉంటారు’ అని హుస్సేన్‌ తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని