కరోనా నియంత్రణలో కేంద్రం విఫలం: రాహుల్‌
close

తాజా వార్తలు

Published : 12/04/2021 01:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనా నియంత్రణలో కేంద్రం విఫలం: రాహుల్‌

దిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తిని నియంత్రించడంలో.. రైతులు, కూలీల సమస్యల్ని పట్టించుకోవడంలో కేంద్రం విఫలమైందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ విమర్శించారు.  ఈ మేరకు రాహుల్‌ ఆదివారం ట్విటర్‌ వేదికగా కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. 

‘దేశంలో ఓ వైపు కరోనా వైరస్‌ వ్యాప్తిపై నియంత్రణ లేదు, మరోవైపు ప్రజలకు సరిపడా వ్యాక్సిన్లు అందుబాటులో లేవు. రైతులు, కూలీల సమస్యలకు పరిష్కారం లేదు.. మరోవైపు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు భద్రత లేదు. ఫలితంగా సమాజంలో ఏ మధ్య తరగతి వ్యక్తి సంతృప్తిగా లేడు. నిరుద్యోగులకు ఉద్యోగాలు సైతం లేవు. కేంద్రం ఇలా సామాన్య మానవుడిని విస్మరించడం సరికాదు’ అని రాహుల్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు. దేశంలో తొలిసారిగా కరోనా కేసులు రికార్డు స్థాయిలో 1.52లక్షలు నమోదైన వేళ రాహుల్‌ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. దేశంలో గడిచిన 24గంటల్లో 1.52లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1.33కోట్లు దాటింది. కాగా నిన్న ఒక్కరోజే కరోనాతో 839 మంది మరణించారు. Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని