తిరుమల పంచాయతీకి ఎన్నికలు ఎందుకుండవ్‌?
close

తాజా వార్తలు

Published : 30/01/2021 16:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తిరుమల పంచాయతీకి ఎన్నికలు ఎందుకుండవ్‌?

తిరుమల, న్యూస్‌టుడే: ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుమలకు నిత్యం వేల భక్తుల రాకపోకలతోపాటు స్వామివారి కైంకర్యాలు, సేవల కోసం కొన్ని కుటుంబాలు తిరుమలలోనే స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడంతో గ్రామంగా విస్తరించింది. ప్రస్తుతం పదివేలకు పైగా జనాభా కలిగిన ఇక్కడ 4వేల మందికి పైగా ఓటర్లు ఉన్నారు. వీరిలో కొందరు తితిదే ఉద్యోగులుగా, మరికొందరు వ్యాపారులుగా స్థానికంగానే నివాసం ఉంటున్నారు. తిరుమల ప్రత్యేకత దృష్ట్యా ప్రభుత్వం ఈ గ్రామాన్ని ప్రత్యేక ప్రాంతంగా గుర్తించింది. గ్రామ పంచాయతీగా గుర్తింపుపొందినా ఇక్కడ స్థానిక ఎన్నికలు జరగవు. పంచాయతీ అభివృద్ధి మొత్తం తితిదే ఆధ్వర్యంలోనే జరుగుతుంది. తితిదే ఈవో గ్రామాభివృద్ధి అధికారిగా వ్యవహరిస్తారు. స్థానికుల ఇబ్బందులను తితిదే ఆధ్వర్యంలోనే పరిష్కరిస్తారు. తిరుమల ఓటర్లు శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో మాత్రమే ఓటుహక్కును వినియోగించుకుంటారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని