Nokia C30: నోకియా నుంచి భారత మార్కెట్లోకి మరో స్మార్ట్‌ఫోన్‌!

తాజా వార్తలు

Updated : 22/10/2021 15:35 IST

Nokia C30: నోకియా నుంచి భారత మార్కెట్లోకి మరో స్మార్ట్‌ఫోన్‌!

దిల్లీ: స్మార్ట్‌ఫోన్‌ టెక్నాలజీలో మొదట్లో వెనుకబడ్డ నోకియా తిరిగి పుంజుకుంటోంది. ఇటీవల వరుసపెట్టి తమ బ్రాండ్‌ స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తోంది. మూడు నెలల కిందట నోకియా జీ 20 మోడల్‌ను తీసుకొచ్చిన ఆ సంస్థ.. ఇటీవల నోకియా ఎక్స్‌ఆర్‌20 పేరుతో మరో స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తెచ్చింది. తాజాగా బ్యాటరీ సామర్థ్యం ఎక్కువగా ఉన్న నోకియా సీ30 మోడల్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. గత జులై నెలలోనే ఈ మొబైల్‌ అంతర్జాతీయ మార్కెట్లోకి రాగా.. గురువారం భారత విపణిలోకి ప్రవేశ పెట్టారు.

నోకియా సీ 30 ఫీచర్స్‌..

నోకియా సీ30 మొబైల్‌లో 6000 ఎంఏహెచ్‌ భారీ బ్యాటరీ అందిస్తున్నారు. 6.83 అంగుళాల హెచ్‌డీ + డిస్‌ప్లేతోపాటు 400 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ను ఉంటుంది. ఆండ్రాయిడ్‌ 11 ఆధారిత ఓఎస్‌ ఉన్న ఈ మొబైల్‌లో ఆక్టా-కోర్‌ యూనిసోక్‌ SC9863A ప్రాసెసర్‌ను ఉపయోగించారు. కెమెరాల విషయానికొస్తే.. మొబైల్‌ వెనుక వైపు రెండు కెమెరాలు అమర్చారు. 13 ఎంపీ ప్రైమరీ కెమెరాతోపాటు 2 ఎంపీ డెప్త్‌ సెన్సార్‌ కెమెరా ఉంటుంది. ముందుభాగంలో 5 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంది. ఈ ఫోన్‌ 10 వాట్స్‌ ఛార్జర్‌ సపోర్ట్‌తో వస్తోంది. ఇంకా వెనుకవైపు ఫింగర్‌ప్రింట్‌ అన్‌లాక్‌ సిస్టమ్‌, బ్లూటూత్‌ 4.2 వెర్షన్‌, మైక్రో యూఎస్‌బీ, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్‌ జాక్‌ ఉన్నాయి.

రెండు వేరియంట్లు

ఆకుపచ్చ, తెలుపు రంగుల్లో లభ్యమయ్యే నోకియా సీ 30 మొబైల్స్‌.. రెండు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చాయి. 3 జీబీ ర్యామ్‌ + 32 జీబీ అంతర్గత మెమొరీ సామర్థ్యం ఉన్న మొబైల్‌ ధర రూ.10,999గా ఉండగా.. 4జీబీ ర్యామ్‌ + 64 జీబీ అంతర్గత మెమొరీ సామర్థ్యం ఉన్న మొబైల్‌ 11,999గా నిర్ణయించారు. ప్రముఖ రిటైలర్‌ దుకాణాలు, ఈ-కామర్స్‌, నోకియా వెబ్‌సైట్‌లో విక్రయాలు మొదలయ్యాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌కు జియో ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. ఎవరైనా ఈ మొబైల్‌ను జియో ఆఫర్‌తో కొనుగోలు చేస్తే.. 10 శాతం (రూ.వెయ్యి వరకు) రాయితీ లభిస్తుంది. ఈ ఆఫర్‌ వినియోగించుకోవాలంటే కొనుగోలుదారులు స్థానిక జియో షోరూంకి వెళ్లి లేదా మైజియో యాప్‌లో పేరు నమోదు చేయాలి. తద్వారా ఇన్‌స్టంట్‌ రాయితీ లభిస్తుంది. లేదా మొబైల్‌ కొనుగోలు చేసిన 15 రోజుల్లోగా మైజియో యాప్‌లో పేరు, వివరాలు నమోదు చేస్తే.. అరగంటలోగా ఆఫర్‌ కింద వచ్చే పదిశాతం రాయితీ నగదు కొనుగోలుదారు బ్యాంక్‌ అకౌంట్‌లో జమ అవుతాయి.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని