సాగర్‌ తెరాస అభ్యర్థిగా నోముల భగత్‌
close

తాజా వార్తలు

Updated : 29/03/2021 16:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సాగర్‌ తెరాస అభ్యర్థిగా నోముల భగత్‌

హైదరాబాద్‌: నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ అసెంబ్లీ‌ ఉపఎన్నికకు తెరాస తమ అభ్యర్థిని ఖరారు చేసింది. దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కుమారుడు నోముల భగత్‌ కుమార్‌ను ఆ పార్టీ ఎంపిక చేసింది. తెలంగాణ భవన్‌లో తెరాస అధినేత, సీఎం కేసీఆర్‌ నోముల భగత్‌కు బి-ఫారం అందజేశారు. ఉప ఎన్నికలో పార్టీ ప్రచారం కోసం రూ.28లక్షల చెక్‌ను తెరాస అధినేత‌ భగత్‌కు అందించారు. ఈ కార్యక్రమంలో మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్‌, ఎమ్మెల్సీలు శేరి సుభాష్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, నాగార్జున సాగర్‌ తెరాస నేతలు ఉన్నారు. రేపు ఉదయం భగత్‌ నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. 

ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి, ఇతర నేతలు కోటిరెడ్డి, గురవయ్యయాదవ్‌, రంజిత్‌యాదవ్‌, బాలరాజ్‌యాదవ్‌ తదితరులు కూడా టికెట్‌ ఆశించారు. వీరందరి పేర్లను సీఎం పరిశీలించి, సర్వేలు చేయించారు. నల్గొండ జిల్లా పార్టీ నేతలతో పాటు ఇన్‌ఛార్జులు, ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఎమ్మెల్యేల అభిప్రాయాలను తీసుకున్నారు. పార్టీ శ్రేణుల మనోభావాలకు తోడు నోముల నర్సింహయ్య పార్టీకి అందించిన సేవలకు గుర్తింపుగా ఆయన వారసునికి అవకాశం ఇవ్వడం మేలని భావించిన తెరాస అధినేత.. భగత్‌కు టికెట్‌ను ఖరారు చేశారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని