close

తాజా వార్తలు

Published : 04/12/2020 01:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నోముల అంత్యక్రియలకు హాజరైన సీఎం కేసీఆర్‌

పాలెం: గుండెపోటుతో మంగళవారం హఠాన్మరణం చెందిన నల్గొండ జిల్లా నాగార్జున సాగర్‌ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అంత్యక్రియలు గురువారం జరిగాయి. నోముల స్వగ్రామమైన నకిరేకల్‌ మండలం పాలెంలోని స్మృతి వనంలో అంతిమ సంస్కారాలు నిర్వహించారు.  

ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్‌ హాజరయ్యారు. నోముల భౌతికకాయానికి నివాళులర్పించి శద్ధాంజలి ఘటించారు. శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, తెరాస నేతలు నోముల నర్సింహయ్యకు నివాళులర్పించిన వారిలో ఉన్నారు. అభిమాన నాయకుడిని కడసారి చూసి నివాళులర్పించేందుకు అభిమానులు, తెరాస శ్రేణులు భారీగా తరలివచ్చారు.Tags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని