
తాజా వార్తలు
వ్యాక్సిన్ నిల్వకు మామూలు రిఫ్రిజరేటర్ చాలు
2-8 డిగ్రీల సెల్సియస్‌లో భద్రమే ..
దిల్లీ: భారత్‌లో అందుబాటులోకి వచ్చే కొవిడ్-19 వ్యాక్సిన్ల నిల్వ, సురక్షిత సరఫరాకు 2-8 సెల్సియస్ ఉష్ణోగ్రతను కలిగిఉండే సాధారణ రిఫ్రిజరేటర్లు సరిపోతాయని ఆరోగ్య నిపుణురాలు, దిల్లీలోని మౌలానా ఆజాద్ వైద్య కళాశాలలో కమ్యూనిటీ మెడిసిన్ విభాగాధిపతి, డైరెక్టర్ డాక్టర్ సునీలా గార్గ్ ‘ఈటీవీ భారత్’కు తెలిపారు. ‘మోడెర్నా తమ వ్యాక్సిన్లను -20 డిగ్రీల సెల్సియస్‌లో సరఫరా చేయాల్సి ఉంటుందని చెబుతోంది. అయితే సాధారణ రిఫ్రిజరేటర్లో 2-8 డిగ్రీల సెల్సియస్‌లో 30 రోజుల పాటు నిల్వ ఉంచే వీలుంటుంది. జైడస్ క్యాడిలా, ఇతర సంస్థలు రూపొందిస్తున్న వ్యాక్సిన్లు కూడా ఇదే ఉష్ణోగ్రతలో భద్రంగానే ఉంటాయ’ని గార్గ్ వివరించారు. ఫైజర్ అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్‌ను -80 డిగ్రీల సెల్సియస్‌లో నిల్వ చేయాలని చెబుతోందని, భారత్‌లో ఉన్న శీతల గిడ్డంగుల సదుపాయాలు చూస్తే ఇది చాలా కష్టమని ఆమె పేర్కొన్నారు.
తొలుత 170 కోట్ల డోసుల వ్యాక్సిన్: ‘భారత్‌లో తొలుత 82.8 కోట్ల మంది జనాభాకు 170 కోట్ల డోసుల కొవిడ్-19 వ్యాక్సిన్ అవసరమవుతుంది. మొత్తం దేశ జనాభా 138 కోట్లలో 14 ఏళ్లకు పైబడిన వారు 80 శాతం మంది ఉన్నారు. 2021 నాటికి 25 శాతం మందిలో కొవిడ్‌కు ప్రతినిరోధకాలు (యాంటీబాడీస్) అభివృద్ధి అవుతాయి. మిగిలిన 82.8 కోట్ల మందికి రెండు విడతల్లో వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉంటుంద’ని సునీలా గార్గ్ పేర్కొన్నారు. కొవిడ్-19 వ్యాక్సిన్ల సున్నితత్వాన్ని దృష్టిలో ఉంచుకుని శీతల గిడ్డంగుల నుంచి వినియోగదార్లకు చేరవేయడానికి సరైన రవాణా వ్యవస్థల్ని నిర్మించాలని ఆమె పేర్కొన్నారు.
♦ ‘ఆయుష్మాన్ భారత్’ పథకం కింద ఉన్న ఆరోగ్య-సంరక్షణ కేంద్రాలను (వెల్నెస్ సెంటర్లు) కూడా వ్యాక్సినేషన్‌కు వినియోగించుకోవాలి. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) ఇందులో కీలక పాత్ర పోషిస్తుంది. వివిధ నర్సింగ్ అసోసియేషన్లు కూడా ఈ క్రతువులో పాలుపంచుకోవాల్సి ఉంటుందని గార్గ్ వివరించారు.
♦ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం శీతల గిడ్డంగులతో పాటు దేశ వ్యాప్తంగా వేగంగా వ్యాక్సిన్ సరఫరా కోసం సమాలోచనలు చేస్తున్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించాయి. కొవిడ్-19 వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్ జాతీయ కార్యదళం ఇప్పటికే ఔషధ రంగంలోని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, ఆహార తయారీ, అగ్రో బిజినెస్ పరిశ్రమలతో చర్చలు జరిపింది. వ్యాక్సిన్ల నిల్వ, పంపిణీకి ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఒక అంచనాకు వచ్చినట్లు సమాచారం.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- ఆ ఓటమి కన్నా ఈ డ్రా మరింత ఘోరం
- హైదరాబాద్ కేపీహెచ్బీలో దారుణం
- బాయ్‌ఫ్రెండ్ ఫొటో పంచుకున్న కాజల్
- సిరాజ్.. ఇక కుర్రాడు కాదు
- తాగడానికి తగని సమయముంటదా..!
- కన్న కూతురిపై ఏడేళ్లుగా అత్యాచారం
- ఆఖరి రోజు ఓపిక పడితే..!
- చీరకట్టుతో కమలా హారిస్ ప్రమాణ స్వీకారం?
- ఆఖరి రోజు ఆసీస్‌కు భయం.. ఎందుకంటే!
- పాచిపెంట ఎస్సైపై యువకుల దాడి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
