close

తాజా వార్తలు

Published : 10/02/2020 00:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నోటీస్‌బోర్డు 1

ప్రభుత్వ ఉద్యోగాలు

ఉత్కల్‌ యూనివర్సిటీ, భువనేశ్వర్‌
భువనేశ్వర్‌(ఒడిశా)లోని ఉత్కల్‌ యూనివర్సిటీ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
* అసోసియేట్‌ ప్రొఫెసర్లు మొత్తం ఖాళీలు: 42. విభాగాలు: ఆంత్రోపాలజీ, బయో టెక్నాలజీ, బోటనీ, బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌, కెమిస్ట్రీ, కామర్స్‌, కంప్యూటర్‌ అప్లికేషన్‌, జియాలజీ తదితరాలు.

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్‌ డిగ్రీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణత, అనుభవం. దరఖాస్తు విధానం: ముందుగా ఆన్‌లైన్‌లో అప్లికేషన్‌ను నింపాక హార్డ్‌కాపీని పోస్ట్‌చేయాలి.

ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ నింపేందుకు చివరితేది: 04.03.2020. హార్డ్‌కాపీ పంపేందుకు చివరితేది: 11.03.2020.

చిరునామా: రిజిస్ట్రార్‌, ఉత్కల్‌ విశ్వవిద్యాలయం, వాణి విహార్‌, భువనేశ్వర్‌ -751004. వెబ్‌సైట్‌: https://www.utkaluniversity.nic.in/


సైనిక్‌ స్కూల్‌ చింగ్చిప్‌, మిజోరంలో పోస్టులు  

మిజోరంలోని సైనిక్‌ స్కూల్‌ చింగ్చిప్‌ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
* టీచింగ్‌, నాన్‌టీచింగ్‌ పోస్టులు మొత్తం ఖాళీలు: 15. పోస్టులు:  టీజీటీ (ఇంగ్లిష్‌, మ్యాథమెటిక్స్‌), లైబ్రేరియన్‌, ఆఫీస్‌ సూపరింటెండెంట్‌, అప్పర్‌ డివిజన్‌ క్లర్క్‌(యూడీసీ), లోవర్‌ డివిజన్‌ క్లర్క్‌(ఎల్‌డీసీ) తదితరాలు.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో టెన్త్‌, మెట్రిక్యులేషన్‌, బ్యాచిలర్‌ డిగ్రీ, బీఈడీ ఉత్తీర్ణత, అనుభవం.

ఎంపిక విధానం: రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌.
దరఖాస్తు ఫీజు: రూ.500 చివరితేది: 29.02.2020. చిరునామా: ప్రిన్సిపాల్‌, సైనిక్‌ స్కూల్‌ చింగ్‌చిప్‌, చింగ్‌చిప్‌ విలేజ్‌, సెర్చిప్‌ జిల్లా , పిన్‌కోడ్‌ - 796161. వెబ్‌సైట్‌:
https://sschhingchhip.mizoram.gov.in/


వాక్‌-ఇన్స్‌
ఐపీఎఫ్‌టీ, గురుగ్రామ్‌లో వివిధ ఖాళీలు

గురుగ్రామ్‌(హరియాణ)లోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెస్టిసైడ్‌ ఫార్ములేషన్‌ టెక్నాలజీ(ఐపీఎఫ్‌టీ) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి వాక్‌ఇన్‌ నిర్వహిస్తోంది.
మొత్తం ఖాళీలు: 12 పోస్టులు: కన్సల్టెంట్‌/ సీనియర్‌ ఆఫీసర్‌-ఖిఖి, సీనియర్‌ రిసెర్చ్‌ ఫెలో(ఎస్‌ఆర్‌ఎఫ్‌), ప్రాజెక్ట్‌ అసోసియేట్‌- ఖి, కన్సల్టెంట్‌ (బయోసైన్స్‌) తదితరాలు.

వాక్‌ఇన్‌ తేది: 2020, ఫిబ్రవరి 24, 25. వేదిక: ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెస్టిసైడ్‌ ఫార్ములేషన్‌ టెక్నాలజీ(ఐపీఎఫ్‌టీ), గురుగ్రామ్‌.
వెబ్‌సైట్‌:
http://ipft.gov.in/


ప్రవేశాలు
ఎన్‌ఐఆర్‌డీపీఆర్‌లో పీజీడీ ప్రోగ్రాములు

భారత ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖకు చెందిన హైదరాబాద్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ పంచాయతీ రాజ్‌ (ఎన్‌ఐఆర్‌డీపీఆర్‌) కింది ప్రోగ్రాముల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
1) పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ మేనేజ్‌మెంట్‌-రూరల్‌ మేనేజ్‌మెంట్‌ (పీజీడీఎం-ఆర్‌ఎం) 2) పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌(పీజీడీఆర్‌డీఎం)

అర్హత: బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత. ఎంపిక విధానం: ఎన్‌ఐఆర్‌డీపీఆర్‌ నిర్వహించే ఆల్‌ ఇండియా ఎంట్రన్స్‌ టెస్ట్‌/ జాతీయ అర్హత పరీక్షల్లో సాధించిన వాలిడ్‌ స్కోర్‌, గ్రూప్‌ డిస్కషన్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌. చివరితేది: 10.04.2020. వెబ్‌సైట్‌: http://nirdpr.org.in/


ఫెలోషిప్‌
ఎంపీసీఎస్‌టీలో ఫెలోషిప్‌ ప్రోగ్రాములు  

భోపాల్‌లోని ఎంపీ కౌన్సిల్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ వివిధ పరిశోధనలకు అర్హులైన రిసెర్చ్‌ స్కాలర్స్‌ నుంచి దరఖాస్తులు కోరుతోంది.
* రిసెర్చ్‌ అసోసియేట్‌(ఆర్‌ఏ) ఫెలోషిప్‌: రూ.30 వేలు  
* జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో(జేఆర్‌ఎఫ్‌) ఫెలోషిప్‌: రూ.20 వేలు విభాగాలు: అగ్రికల్చర్‌, ఫిజిక్స్‌, డీఐపీ అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఎంఎస్సీ, ఎంటెక్‌, పీహెచ్‌డీ ఉత్తీర్ణత, అనుభవం.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్ట్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

చివరితేది: 20.02.2020. వెబ్‌సైట్‌: http: http://www.mpcost.gov.in/  


మరిన్ని నోటిఫికేషన్లకు www.eenadupratibha.net చూడవచ్చు.


 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

మరిన్ని

దేవతార్చన