close

తాజా వార్తలు

Published : 16/01/2021 18:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

శీర్షాసనంతో ఔరా అనిపించాడు..

ఒడిశా: ఆసనాల్లో శీర్షాసనం కాస్త కష్టతరమైనది. ఆసనాలు వేయడంలో ఎంతో అనుభవం ఉంటే తప్పా ఈ ఆసనాన్ని సులువుగా వేయలేం. అందులోనూ ఐదు పదుల వయసులో ఈ ఆసనం వేయడమంటే మాటలు కాదు. అలాంటి కష్టతరమైన ఆసనాన్ని 50 ఏళ్ల వయసులో నిర్విరామంగా గంటకు పైగా వేసి, గిన్నిస్‌ బుక్‌ ఆఫ్ వరల్డ్‌ రికార్డ్స్‌లో చోటు సంపాదించారు. తద్వారా దేశ సేవలోనే కాదు, యోగాలోనూ మేటి అనిపించారు ఓ ఆర్మీ అధికారి. వివరాల్లోకి వెళ్తే..

ఒడిశాలోని బాలేశ్వర్‌కు చెందిన ఆర్మీ అధికారి లక్ష్మీధర్‌ భూయన్‌ శీర్షాసనంలో అరుదైన ఘనత సాధించారు. ఏకంగా 63 నిమిషాల పాటు శీర్షాసనంలో ఉండి 6వేల సార్లు తన కాళ్లను వెనక్కు తగిలించే కష్టతరమైన ఫీట్‌తో భళా అనిపించారు. 1992 నుంచి సైన్యంలో పనిచేస్తున్న లక్ష్మీధర్‌కు యోగాలో 34 ఏళ్ల అనుభవం ఉంది. ప్రస్తుత గిన్నిస్‌ రికార్డుతో పాటు కోకాకోలా, లింకా బుక్ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం దక్కించుకున్నారు.

ఇవీ చదవండి..

కిష్టమ్మ చెప్పిన తొలి టీకా ముచ్చట!

భారత్‌లో టీకా పంపిణీ..ప్రపంచానికి పాఠాలు!




Tags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని